Showing posts with label Lyrics. Show all posts
Lyrics-వందేమాతరం
తల్లీ మా వందనం!
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం వందేమాతరం
చల్లని వెన్నెల కాంతులలతో పరవశింపచేసి
తెల్లని పువ్వుల సుగంధాలతొ శోభనందచేసి
కిలకిల రవముల నవ్వులతో, చిరు చిరు జల్లుల ప్రేమలతో
సుఖాలనిచ్చే, వరాలనిచ్చే తల్లి వందనం ||వందేమాతరం ||
కోటి కోటి కంఠాలు పలికినవి - వందేమాతరం వందేమాతరం
కోటి కోటి ఖడ్గాలు లేచినవి - వందేమాతరం వందేమాతరం
ఎవరన్నరూ ఆబలవనీ
బహుబలధారిణీ నమామితారిణీ
రిపుదల వారిణీ మాతరం ||వందేమాతరం ||
విద్యవు నీవే ధర్మము నీవే
హృదయము నీవే సర్వము నీవే
ఈ దేహానికి ప్రాణము నీవే
బహుశక్తి మాకిమ్ము హృదయభక్తి గైకొమ్ము
తొమారయి ప్రతిమాగడి మందిరే మందిరే ||వందేమాతరం ||
పది భుజములతో శస్త్ర ధరించిన
ఆదిశక్తివి దుర్గవునీవే
పరిమళాలు వెదజల్లు కమలముల
వసియించెడి శ్రీలక్ష్మివి నీవె
చదువుల నిచ్చెడి వాణివి నీవె
చదువుల నిచ్చెడి వాణివి నీవె
నమామిత్వాం నమామికమలాం
అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం ||వందేమాతరం ||
శ్యామలమైన రూపము నీది సరళమైన అ కంఠమునీది
సుస్మితమైన వదనం నీది భూషితమైన దేహము నీది
విరాట్ రూపుడా వివేకానంద- అందుకో జొహార్లు
విరాట్ రూపుడా వివేకానంద- అందుకో జొహార్లు
శక్తి పుంజమా వివేకుడా- వెదజల్లుము కిరణాలు
నిద్ర్రించి వున్న మములేపి సొమరితనమును దులిపి
విశ్వాసమ్మును నిలిపి ధ్యేయమార్గమున నడిపి
మా స్పూర్తిదాతవు, నేతవు నీవై....... నీవై "విరాట్"
నీ ప్రేరణతో నేతాజీ యువఫౌజ్ ను నిర్మించె
నీ బోధనతో తిలక్ స్వరాజ్య పోరును నడిపించె
స్వతంత్ర సమరములోన.... విప్లవ వీరుల గురువై
భారతజాతికి బలమై - త్యాగభావనకు నెలవై
విశ్వనాథ ప్రసాదమంట - భువనేశ్వరి నోముల పంట
పరమహంస పదముల జేరి.... అలరితివంట "విరాట్"
నీ స్నేహముతో సేవాపథమున నడిచెను నివేదిత
నీ పలుకులు విని పరిశ్రమించెను జంశెడ్జీ టాటా
ఎల్లలు చెరిపిన పయనం..... మనసుల గెలిచిన వినయం
భారతకీర్తిని పెంచి - విశ్వవంద్యుడనిపించి
నీ అడుగు జాడల్లోన - కదిలింది యువకుల సేన
అనుకున్నదయ్యేవరకు - అలుపే లేదు... రాదు "విరాట్"
స్వామీజీ వివేకుడే కలలుగన్న భారతం
స్వామీజీ వివేకుడే కలలుగన్న భారతం
గత వైభవ శిఖరాల అంచుదాక చేరుదాం
ఇహపరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం
ఆ లక్ష్యము చేరుదాక ఆగకుండ సాగుదాం !!
ఇనుప కందరాలు సంఘశక్తినినుమడించగ
ఉక్కునరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా
విలాసాల మత్తు వదలి వివేకుని బాట నడచి
స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం !!
దేవుడెక్కడున్నాడని నలుదిక్కుల శోధించె
దీన దళిత దుఖితులను దైవంగా దర్శించె
పంథాలెన్నున్నా మన గమ్యమొక్కటేనని
ప్రపంచానికందించే సందేశం ఇదేనని !!
ప్రతి వ్యక్తి సోదరుడని సగర్వంగ ప్రకటించి
అన్నర్తుల అజ్ఞానుల కస్టాలను కడతేర్చి
జగతిలోన భరతమాతనధి దేవతగా నిల్పి
భారతమే వసుధలోన మార్గదర్శి కావాలని !! --Appala Prasad
తెలుసుకో ధీర సన్యాసీ,
తెలుసుకో ధీర సన్యాసీ,
ఎలుగెత్తి పాడరా ఓం తత్ సత్ ఓం !!
స్వాతంత్ర్య వీరుడవు జ్ఞాన సంపన్నుడవు
సకల జగతికి సాక్షిభూతుడవు నీవెరా
ఆకారమే లెదు నామరహితుడవు నీవు
ఆత్మయై అన్నింట వెలుగొంది లేవరా !!
మంచి చేసిన మంచి , చెడ్డ చేసిన చెడ్డ
ఏ విత్తనము వేస్తె ఆ పంటయే వచ్చు
నీవు చేసిన కర్మ అనుభవించాలిరా
కర్మఫలమంటనిది ఆత్మయే నిజమురా !!
కొరివి దయ్యము చూసి కాంతి అనబోకురా
కటిక చీకటి చీల్చి కదనమెత్తర నీవు
జనన మరణము తెలిసి బ్రతుకుపై తీపేల
ఆత్మ గెలిచిన ఇంక అడ్డునీకేముంది !!
వాసనలు దరిరాని కారడవులందున
కోరికలు దగ్ధమౌ కొండ గుట్టలయందు
అజ్ఞానమే లేని తీర్థరాజములలో
అంతటా శాంతి సందేశం , ఆత్మయే నిత్య సంతోషం !!
తలిదండ్రులెవ్వరు? కొడుకు స్నేహితులెవరు?
ఎవరి చుట్టం వీడు? ఎవరు శత్రువురా?
కలల లోకమ్ములో విహరించ బోకురా
నిర్గుణమ్మైన ఈ ఆత్మయే నిజమురా !!
బంగారు గొలుసులే బానిసపు సంకెళ్ళు
రాగద్వేషాలు నిను బంధించి వేసెరా
సంకెళ్ళు త్రెంచుకొని విదిలించి లేవరా
సత్య స్వేచ్చా గీతమాలపించగ రార !!
స్వామీ వివేకుడా తేజస్వరూపుడా
స్వామీ వివేకుడా తేజస్వరూపుడా
కణకణం క్షణక్షణం చైతన్యదీప్తుడా స్వామీ
చిమ్మచీకట్లలో చిరుదివ్వెవైనావు
సమ్మెటతొ బానిసపు సంకెళ్ళు త్రెంచావు
జ్ఞాన సుధలను పంచి జవ సత్వములునింపి
నలుదిశల నడయాడి భారతిని కొనియాడె స్వామీ
అస్పృశ్యతను తృంచి సమరసాలొలికించి
ప్రతి జీవిలోనున్న పరమాత్మ దర్శించి
దౌర్బల్య వైరివై వేదాంత భేరివై
వీర సన్యాసివై సత్యశొధన చేయు స్వామీ
స్వాభిమానపు జ్యోతి యువతలో వెలిగించి
స్వాతంత్ర్య సమరాగ్ని కుండమున నిలిపావు
ఆధ్యాత్మ కిరణమై విజ్ఞాన చలనమై
ఆరాధ్య దైవమై అందరికి నేతవై స్వామీ
సంకుచిత స్వార్థాల పంథాల నెదిరించి
విశ్వమత సభ లోన హుంకారమును చేసి
భారతీయుల ఆత్మ విశ్వాత్మగా కొలిచి
త్యాగ సేవా గుణము ప్రగతిపథమన్నావు స్వామీ
వివేకానందుని పై పాట
అందగాడు మన వివేకానందుడు అందరివాడన్న
ఉడుకురక్తము ఉరికేటట్లు బోధ చేసెనన్న !!
కులం పేరున భేదమొద్దని,నాన్నకు సుద్దులు సెప్పిండన్న
పేదల కష్టం చూసి ఇంటిలో వున్నది దానం ఇచ్చిండన్న
బళ్ళో చదువులు చదివినగాని ,తోటలొ ఆటలు ఆడినగాని
ఉన్నట్లుండి మౌనముద్రలో మునిగిన ఋషియన్న !!
దేవుడు వుంటె చూపాలంటూ జాడ వెతుకుటకు వెళ్ళిండన్న
పరమహంసయే గురువుగ దొరికే, హృదయములో ఆనందం ఉబికే
భారతదేశం అటు ఇటు తిరిగి,భారతప్రజల బాధలు ఎరిగి
కన్యకుమారి కడలిని చేరి ,అంతరంగమున కలవరమొందె !!
వెంట తరిమిన కోతుల చూసి ఎదురుతిరిగెను వినరన్నా
గొర్లమందలో కాటగలసి,ఇక సింహంలా లేసిండన్నా
బలమువుంటె బ్రతుకన్నడు, భయంతొటె చావన్నడు
గుండె ధైర్యము నిండుగ వుండి అమెరికాలొ అడుగేసిండన్న !!
ఆకలిదప్పులు తోడున్నా, చెట్టు నీడలో పడుకున్నా
అందరమొకటని వివేకుడన్నా,అంటరానివాడన్నారన్నా
చదివిన శాస్త్రాల్ చెప్పుతుపోతె మేధావులనే మించిండన్నా
విశ్వమతంలొ పీఠంవేసి ఉపన్యాసమె దంచిండన్నా !!
యూదులు,పార్శీలెందరొచ్చినా ఆశ్రయమిచ్చిన దేశం మనది
ప్రపంచ మతాలు ఎవర్ని కొలిసిన ,వినే దేవుడు ఒకటేనన్నా
బావిలొ కప్పగ బెకబెక మంటె బాధలు తప్పవు అన్నాడు
అందరిలో పుణ్యాత్ములచూసె గుణం పెంచుకోమన్నాడు !!
-1891-2.jpg)

.jpg)
