- Back to Home »
- Lyrics »
- స్వామీ వివేకుడా తేజస్వరూపుడా
Posted by : Sainadh Reddy
Sunday, 17 June 2012
స్వామీ వివేకుడా తేజస్వరూపుడా
కణకణం క్షణక్షణం చైతన్యదీప్తుడా స్వామీ
చిమ్మచీకట్లలో చిరుదివ్వెవైనావు
సమ్మెటతొ బానిసపు సంకెళ్ళు త్రెంచావు
జ్ఞాన సుధలను పంచి జవ సత్వములునింపి
నలుదిశల నడయాడి భారతిని కొనియాడె స్వామీ
అస్పృశ్యతను తృంచి సమరసాలొలికించి
ప్రతి జీవిలోనున్న పరమాత్మ దర్శించి
దౌర్బల్య వైరివై వేదాంత భేరివై
వీర సన్యాసివై సత్యశొధన చేయు స్వామీ
స్వాభిమానపు జ్యోతి యువతలో వెలిగించి
స్వాతంత్ర్య సమరాగ్ని కుండమున నిలిపావు
ఆధ్యాత్మ కిరణమై విజ్ఞాన చలనమై
ఆరాధ్య దైవమై అందరికి నేతవై స్వామీ
సంకుచిత స్వార్థాల పంథాల నెదిరించి
విశ్వమత సభ లోన హుంకారమును చేసి
భారతీయుల ఆత్మ విశ్వాత్మగా కొలిచి
త్యాగ సేవా గుణము ప్రగతిపథమన్నావు స్వామీ