- Back to Home »
- Articles »
- రూపాయి పతనం-8
Posted by : Sainadh Reddy
Thursday, 29 August 2013
రూపాయి పతనంతో బంగారానికి రెక్కలు వచ్చాయి. ఇప్పుడు మార్కెట్లో బంగారం ధర 35,074 రూపాయలు పెరిగింది. ఎప్రిల్ 2013లో 10 గ్రాములకు 25,000 రూపాయలు వుండేది. రూపాయి 19 శాతం తగ్గటంతో బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. దిగుమతి చేసుకునే బంగారపై దిగుమతి సుంకం పెంచటం కూడా ధర పెరగడానికి కరణమైంది. 10రోజుల్లోనే ఇదంతా జరిగిపోయింది.
ఇప్పుడు కరెంట్ అకౌంట్ లోటు 85 బిలియన్ దాలర్లు. గిడిపి 4.5 శాతం వుంది. 1991 నాటి స్థితి కంటే 2013 పరిస్థితి దారుణంగా వుంది. అంతర్జాతీయంగా ఆర్ధిక వనరుల కొరత ఎక్కువగా వుందీ రోజు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలి విదేశీ కంపనీల పెట్టుబడుల పై ఆధారపడకూడదన్న పాఠం నేర్చుకోవాలి.
18 డాలర్ల విలువ గల బొగ్గును నేడు దిగుమతి చేసుకుంటున్నాం. భారత్ స్వయంగా బొగ్గు ఉత్పత్తులను జరిపి 10 బిలియన్ డాలర్లను అదనంగా ఆదా చేయగలదు. అలాగే కర్నాటక,గోవాలలో ప్రబుత్వం ముడి ఇనుము (గన్నుల త్రవ్వకం ద్వారా) 8 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం సంపాదించవచ్చును. పెద్ద పెద్ద కంపనీలు విదేసీ అప్పు పై ఆధారపడి, నేడు గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నాయి. అవి ఇప్పటికైనా గుణ పాఠం నేర్చుకోవాలి.