- Back to Home »
- Articles »
- రూపాయి పతనం-7
Posted by : Sainadh Reddy
Thursday, 29 August 2013
ఈ రోజు డాలర్ తొ పోలిస్తే రూపాయి విలువ తగ్గింది. 68.85 పైసల వద్ద ఆగిపోయింది. సిరియా పై అమెరిక దాడి చేయన్నునదని వార్తలు పొక్కడం, క్రూడాయిల్ ధరలు పెరగడానికి అవకాశాలు వున్నాయన్న వార్తలతో ఆయిల్ కంపెనీల నుండి డాలర్ కు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ పతనం మొదలయ్యింది. అంతే గాదు లోక్ సభలు ఆమోదించిన ఆహార భద్రత బిల్లు వల్ల ద్రవ్యలోటు మరింత పెరుగుతుందని భావించి కొత్తగా విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ వేస్తున్నారు.
దాంతో రూపాయి విలువ తగ్గిపోయింది. క్రూడాయిల్ ధర ఒక బ్యారల్ కు 8,160 రూపాయలు ప్రస్తుతం పెరిగింది. కొద్దిరోజుల్లో రూపాయి విలువ 72 నుండి 75 రూపాయిలకు తగ్గినా ఆశ్చర్యం లేదు. గత 18 నెలల్లొ రూపాయి విలువ ఇంతగా ఎప్పుడూ దిగజారలేదు. రూపాయి విలువ నిలబెట్టలేని భారత ప్రభుత్వంపై ఆశలు సన్నగిల్లి విదేశీ తాత్కాలిక పెట్టుబడి సంస్థలు, భారత్ స్టాక్ మార్కెట్లొ పెట్టిన డాలర్ల మొత్తాన్ని, తమ దేశాలకు తరలిస్తుండటంతో డాలర్ సప్లై తగ్గి, రూపాయి వేగంగా పడిపోతున్నది.
ఆర్ధిక వ్యవస్థ పరిరక్షణకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు, స్వదేశీ కంపెనీలు, ప్రజలు ఐక్యంగా నడుం కట్టవలసివుంది.