- Back to Home »
- Articles »
- చైనా కొత్త రాగం అందుకుంటున్నది
Posted by : Sainadh Reddy
Thursday, 29 August 2013
చైనా కొత్త రాగం అందుకుంటున్నది. అదేమిటో తెలుసా.. 90000 చదరపు కిలోమీటర్ల తన భూభాగం భారత్ ఆధీనంలొ వుందట.ఆ భూమిని వెంటనే అప్పగించాలని పేచీ పెడుతున్నది. అది ఇప్పటికే 1962లొ 38వేల చదరపు కిలోమీటర్ల భారత భూమిని ఆక్రమించింది.1963లోనేమో పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ భూభాగంలొ 1583చదరపు కిలోమీటర్ల భూమిని కూడ చైనా ఆక్రమించింది.చైనా ఎదుగుదల ప్రపంచాన్నే కలవరపెడుతున్నది.పాశ్చాత్య దేశాలకు మించి, 21శాతం పైగా గ్రీన్ హౌస్ ఉద్గారాలను వదలిపెడుతున్నది.కార్బన్ డైఆక్సైద్,కార్బన్ మోనాక్సైడ్,సల్ఫర్ డైఆక్సైడ్,మిథైన్,నైట్రిక్ ఆక్సైడ్ వంటి రసాయనాలను వదలిపెట్టి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నది. రాజకీయంగా ,ఆర్థికంగా ,సైనికపరంగా దురాక్రమణకు పాల్పడుతున్న చైనా వ్యాపారానై అడ్డుకోవాలి.చైనా కుటిలనీతులను మన మిత్రులకు ఎప్పటికప్పుడు సొషల్ మీడియా ద్వారా తెలియపరచాలి.ముఖ్యంగా చదువుకున్న యువకులకు అర్థం చేయించాలి.