- Back to Home »
- Articles »
- అమెరికాలో ఇదీ పరిస్థితి....
Posted by : Sainadh Reddy
Saturday, 7 September 2013
1700 సంవత్సరంలో మన జిడిపి వృద్ధి రేటు 21శాతం. అప్పుడు మనమే సూపర్ పవర్. అప్పుడు చైనా తప్ప మనతో పోటీ పడే దేశమే లేదు.ఈ రోజు పరిస్థితి ఏమిటి? అమెరికా నుండి అరువు తెచ్చుకున్న ఆలోచనలతో మనం విధానాలను రూపొందిస్తున్నాము.అమెరికాకు భారత్ కార్బన్ కాపీగా మారింది.మన పాలకులు,విద్యావంతులు,విద్యార్థులు,ప్రణాలికా వేత్తలు ఎవరు కూడా ఆర్థిక శాస్త్రం చదవటం మానేశారు.స్వంతంగా ఆర్థిక అభివృద్ధిని సాధించాలన్న ఆలోచనే కరువయ్యింది.మనం ఒకటి గమనించవలసిన విషయం ఒకటుంది.అమెరికా ప్రజలు 50శాతం పైగా డబ్బులు స్టాక్ మార్కెట్లో పెడతారు. జపాన్ ప్రజలు 9శాతం పెడతారు. భారతీయులు 2.3శాతం మాత్రమే పెడతారు.అందుకోసం అమెరికాలో సంక్షోభం వచ్చినా మనకు నష్టమేమీ కలుగదు.అమెరికా ప్రభుత్వం మరియు కార్పోరేట్ రంగం కారణంగా అక్కడి వ్యవస్థ నడుస్తుంది.కుటుంబాల పాత్ర లేదు. ఆసియా దేశాలతో పోలిస్తే,అక్కడి కుటుంబాలు విచ్చిన్నమయ్యాయి.55శాతం వివాహాలు 1సంవత్సరం తరువాత విడాకులతో ముగుస్తాయి.రెండవసారి వివాహం చేసుకున్న తరువాత 60శాతం విడాకులే మార్గమవుతాయి.మూడవసారి వివాహాల్లో 75శాతం విడాకులతో సమాప్తమవుతాయి.అమెరికా కుటుంబాల్లో 27శాతం 'తల్లీ లేకుండా తండ్రి,పిల్లలు వుండేవి,లేదా తండ్రి లేకుండా,తల్లి పిల్లలు మాత్రమే వుండే కుటుంబాలు జీవిస్తున్నాయి.అందుకే అక్కడ ఖర్చులెక్కువ.కుటుంబాలు ఎక్కువ వడ్డీ రేటుకి అప్పులు చేస్తారు.అమెరిక ప్రభుత్వం ఈ సింగిల్ పేరెంట్ ఇళ్ళకోసం అప్పులు తెచ్చి బడ్జెట్లో ఖర్చుపడతారు. అందుకే అక్కడ సేవింగ్స్ రేటు నెగెటివ్ గా(-0.4శాతం) వున్నది.అమెరికాలో ప్రతి వ్యక్తి దగ్గర 10 క్రెడిట్ కార్డులు వుంటాయి.38కోట్ల అమెరికా జనాభాకు 120 క్రెడిట్ కార్డులున్నాయంటే మీరు ఊహించండి అదెంత దుబారా చేసే వినియోగవాద దేశమో...అమెరికా చేసిన అప్పు 1.5 ట్రిలియన్ డాలర్లు.ఈ అప్పు ఆ దేశ జిడిపి తో సమానం.దీనికంతటికి కారణం ఒక్కటే..అమెరికాలో కుటుంబాలు విచ్చిన్నం కావటం వల్లనే.