- Back to Home »
- Articles »
- రూపాయ విలువ పతనం కావడానికి అత్యంత ప్రధానమైన కారణం
Posted by : Sainadh Reddy
Thursday, 29 August 2013
శీతల పానీయాలు (cool drinks), బంగాళా దుంపల వేపుడు (alu chips), పిజ్జా, బర్గర్, చాక్లెట్ మొదలైన వాటిని కొద్ది పెట్టుబడితో మన దేశంలో తయారు చేస్తున్న బహుళజాతి సంస్థలు వాటిని అత్యధిక రేట్లకు మనకే అమ్మి వచ్చిన లాభాలను తమ దేశాలకు తరలిస్తున్నాయి.( ఉదాహరణకు ఒక లీటరు కూల్ డ్రింకు తయారు చేయడానికి ఏబది పైసలు ఖర్చవుతుంది, దానిని పదిహేను రూపాయలకు అమ్ముతున్నారు) అందువలన పెట్టుబడుల పేరుతో వస్తున్న 'డాలర్' ల కంటే డాలర్ లుగా మారి విదేశాలకు వెడుతున్న రూపాయల సంఖ్య ఎక్కువగా వుంది. రూపాయ విలువ పతనం కావడానికి ఇది అత్యంత ప్రధానమైన కారణం అంటే ఆశ్చర్యంగా వుంది కదూ !!!
అవసరమైన తిండి పదార్ధాలను, అందమైన పోట్లాలలో అమర్చిన మిఠాయిలను దిగుమతి చేసుకోవడము మానినట్లయితే కోకాకోల వంటి శీతల పానీయాలను తాగడము మానినట్లయితే మన 'రూపాయలు' బయటికి వెళ్ళడము తగ్గుతుంది. ఫలితంగా మన వినిమయ ద్రవ్యం విలువ పెరుగుతుంది. చైనా నుండి వచ్చిపడుతున్న విలాస వస్తువులను నిషేధించడము ద్వారా వాణిజ్య లోటును తగ్గించవచ్చు. చెక్కెర, బియ్యం, కూరగాయలు పప్పులు, నూనెల ఎగుమతులను పూర్తిగా నిషేధించడము వలన వాటి ధరలు తగ్గి ఆహార ద్రవ్యోల్భణం, చిల్లర ద్రవ్యోల్భణం తగ్గుతుంది. చిల్లర వ్యాపారము లోకి చొరబడుతున్న విదేశీయ సంస్థలను అరికట్టడము వలన కృత్రిమమైన కొరతలు తగ్గిపోతాయి...ఇవేమీ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా లేదు.