Showing posts with label Articles. Show all posts

కేవలం క్యాలండెర్ లొ మార్పు వస్తే శుభం ఎలా కలుగుతుంది

జనవరి ఫస్ట్ న శుభం జరగాలని ' విష్ యూ హ్యాపి న్యూ ఇయర్ ' అని చెపుతాం కదా? కేవలం క్యాలండెర్ లొ మార్పు వస్తే శుభం ఎలా కలుగుతుంది?ఖగోళం ప్రకారం వాతావరణం లో జరిగే మార్పుల వల్ల మన శరీరం లో మార్పులు వస్తాయని సైన్స్ చెప్పుతున్నదని నీకు తెలుసుకదా? అందుకే వైరస్ ప్రబలేందుకు అవకాశమున్న ఆ తరుణం లో వేప పచ్చడి తో ఆ వైరస్ ని నిరోధించవచ్చునని మన పూర్వీకులు ఎన్నడో చెప్పారు,అది నిజమని నేటి శాస్త్ర జ్ఞులు కూడ ఒప్పుకుంటున్నారు కదా? అందుకే వసంత ఋతువు లో వచ్చే ఉగాది అందరికి శుభం కలుగ చేస్తుందనటం లో సందేహం అసలే లేదు.కొత్త వేప,కొత్త బెల్లం,కొత్త చెరకు ఇలా కొత్త అందాలను నింపుకునే ప్రకృతి వాతావరణంలో ఉగాది కొత్త సంవత్సరం జరుపుకోవటం ఎంత శాస్త్రీయమో,సమంజసమో కొంత కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే..ఆంగ్ల బానిసత్వానికి వీడ్కోలు పలికి,భారతీయ పద్దతులను మళ్ళీ ఆధునికతకు అనుగుణంగా అందరికీ అందచేసినప్పుడే మన జన్మకు సార్ధకత ఏర్పడుతుంది...ఏమంటారు?

డిశంబర్ 31 ని మాములుగానే పోనియ్యండి..క్యాలండెర్ ని జనవరి 1 కి మాములుగానే మార్చండి. ఆ ఒక్క రాత్రి ఎప్పుడూ పడుకున్నట్లే,నిద్ర పోయి, ఆ ఒక్క రోజును మరిచిపోతే మీ జన్మ ధన్యమైనట్లే! మన ఉగాది కొత్త సంవత్సరం ఏమి నేర్పుతుంది.?..సూర్యోదయం తో పండుగ మొదలవుతుంది.కనుక డిసంబర్ 31అర్థరాత్రి పిచ్చి పనులకు అవకాశం లేదు.ఉదయం తల స్నానం చేసి ,దేవున్ని మొక్కి,కొత్త బట్టలు తొడిగి,బంధువులు,తల్లిదండ్రులు,స్నేహితులతో కలిసి వేప పువ్వు పచ్చడిని తీసుకుంటాం.పొరుగువాళ్ళకు పంచుతాము.ముగ్గులు,మామిడి తోరణాలతో అలంకరించుతాము.ఆరోగ్యకరమైన పచ్చడి, సాంప్రదాయ భోజనాలు స్వీకరిస్తాము. సాయంత్రం దేవాలయం వెళ్ళి,లేదా రచ్చబండ వద్ద పంచాంగ శ్రవణం తో గడుపుతాము. ఖగోళం ప్రకారం కాలమనం లెక్కించే పద్దతి తెలుస్తుంది.జీవితం లో నియమ బద్ధత ఏర్పడుతుంది.ఆద్యాత్మిక ప్రశాంతి ఏర్పడుతుంది.కుటుంబమంతా సంతోషంగా వుంటుంది.తప్ప త్రాగటం, తూలటం,పిచ్చిగా వాగటం ఏమీ వుండవు.మన ఉగాది పండుగ మనకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పుతుందంటే ....ఉగాదిని మనం ఎందుకు ఘనంగా జరుపుకోకూడదు? ఈ విషయాన్ని అందరికీ ఎందుకు అర్థం చేయకూడదు? రక రకాలైన కాలేయ సంబంధమైన రోగాలకు కారణమైన మద్యం త్రాగటం కంటె...వేపపువ్వు,కొత్తబెల్లం,శనగపప్పు,అరటిపళ్ళు,మామిడిముక్కలు,కొబ్బరిముక్కలు,చెరకు గడలు మొదలైన వాటితొ ఉగాది పచ్చడి చేసుకుని త్రాగితే నిజంగా ఆరొగ్యం కాదా? డిశంబర్ 31 ని మాములుగానే పోనియ్యండి..క్యాలండెర్ ని జనవరి 1 కి మాములుగానే మార్చండి. ఆ ఒక్క రాత్రి ఎప్పుడూ పడుకున్నట్లే,నిద్ర పోయి, ఆ ఒక్క రోజును మరిచిపోతే మీ జన్మ ధన్యమైనట్లే!



హ్యాపీ న్యూ ఇయర్,డిశంబర్ 31 రాత్రి 12 గంటలు,ఆంగ్లేయుల ఈ కొత్త సంవత్సరం చివరికి మనకు నేర్పుతున్నదేమిటి? డిశంబర్ 31 అర్థరాత్రి క్లబ్బుల్లోనూ,హోటల్స్ లోనూ,ఇళ్ళలోనూ,తోటల్లోనూ,రోడ్లమీదా...ఆడ,మగ తేడాలేకుండా గుంపులు..గుంపులుగా జనం చేరుతున్నారు.ఇందులో యువతీ యువకులు ఎక్కువగా వుంటున్నారు.వెస్టర్న్(పాశ్చాత్య)మ్యూసిక్ ల హోరులో,జోరులో,కేరింతలతో,చిందులేస్తూ అల్లరిచేస్తూ, కాలం గడుపుతారు.కొందరు పేకాట వంటి జూదాలు ఆడితే,మరి కొందరు మత్తుపదార్థాలు సేవిస్తారు.ఇలా వివిధ రకాలైన దురభ్యాసాలతో,అసభ్యరీతుల్లో ప్రవర్తిస్తుంటారు.రోడ్లపై పరుగులు,అరుపులూ,గోల,కేకలు... రాత్రి సమయమంతా టెలివిజన్ చానల్స్ విదేశీ సంగీత నృత్యాలతో రెచ్చిపోతున్నారు.షాంపైన్ బాటిల్స్ ఒపెన్ చేస్తూ ఆ నురగల్లో ఉబ్బితబ్బిబ్బైపోతారు.అర్థరాత్రి పిశచాల ఆనందం అంటే ఇదేనేమో? ఈ దురాచారం నగరాల నుండి గ్రామాలకు ప్రాకిపోయింది. అందరూ చేస్తున్నారు..మేము చేయకపోతే ఎలా అంటూ గొర్రెల మందలా అనుసరిస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్,డిశంబర్ 31 రాత్రి 12 గంటలు,ఆంగ్లేయుల ఈ కొత్త సంవత్సరం చివరికి మనకు నేర్పుతున్నదేమిటి? తాత్కాలికి ఎంజాయ్ మెంట్ ,దురలవాట్లు,మన స్వంత ఆచారాలను,సంప్రదాయాలను తెలుసుకోలేని అజ్ఞానం,విచ్చలవిడితనం,అనవసర ఖర్చులు.. గత పన్నెండు నెలలుగా చేసిన మంచి ఆలోచనలు,నోములు,వ్రతాలు,దేవాలయ దర్శనాలు ,మొక్కులు,మొక్కుబడులు,హిందూమతం,భారతీయ భావన ....బూడిదలో పోసిన పన్నీరులా, మనదంతా విదేశీయులకు ధారపోసి ఆ ఒక్క అర్ధరాత్రి డిశంబర్ 12 గంటలకు ఆ కొద్ది సేపు ఆంగ్లేయుల అలవాట్లకు సాష్టాంగ పడి,సరెండర్ అయి పోయి, బానిస బ్రతుకులుగా మారిపోవటం ఎంత బాధాకరమో,అవమానకరమో,ఎంత మూఢాచారమో,ఎంత అజ్ఞానమో,స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్ళు గడిచినా,మనం మారేది ఎప్పుడో? అని మీకు మీరు అలోచించుకోవటం కోసమే ఇదంతా చెప్పేది! అంతే కాని బలవంతంగా చెప్పలేము కదా? ఈ స్వేచ్చాయుత దేశం లో ఆలోచించమని చెప్పగలము అలాగే గుడ్డిగా ఏదీ కూడా అనుసరించవద్దని విన్నపం చేయగలం.


సైన్స్ తెలిసిన వాళ్ళం అని మనం చెప్పుకుంటాం కదా? వూరందరిదీ ఒకదారి అయితే,వులిపి కట్టెది మరో దారి" అన్నట్లు మనం ఎందుకు వుండాలి?,నలుగురితో పాటూ నారాయణా' అన్నట్లు వుండాలి కదా?ప్రపంచమంతటా జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ గా జరుపుకుంటే మనం ఆచరిస్తే తప్పేమిటి?అదేమైన నేరమా? కానే కాదు.జనవరి ఫస్ట్ టు డిశంబర్ ఎక్కువమంది జరుపుతున్నారు.కాదనను.కాలమానం,ఖగోళం ప్రకారం 'జనవరి ఫస్ట్' న్యు ఇయర్ కాదని, మనకు న్యూ ఇయర్ 'ఉగాది ' అని మాత్రమే తెలుసుకోవాలి.చదువుకున్నవాళ్ళమని,ఆధునికులమని,సైన్స్ తెలిసిన వాళ్ళం అని మనం చెప్పుకుంటాం కదా? "జనవరి ఫస్ట్ " సైన్స్ ప్రకారం న్యూ ఇయర్ కాదని తెలిసి కూడా ఎలా..ఎందుకు జరుపుకోవాలో చెప్పగలమా?మనం ఖగోళ శాస్త్రం అనుసరించి వేల సంవత్సరాలుగా కాలమానం లెక్క పెడుతుంటే,వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంగ్లేయులు మన దేశం తో పాటూ 71 దేశాలపై ఆక్రమణ చేసి, బలవంతంగా వాళ్ళ క్యాలండర్ ని,కాలమానంగా రుద్దినందు వల్ల మనం పాటిస్తున్నాము.ఇప్పుడు ఆంగ్లేయులు లేరు కదా? ఇప్పటికైన నిజాలు,గుణపఠాలు నేర్చుకుని నడవటం బుద్ధిమంతుల లక్షణం కాదా చెప్పండి?


గడియారం 12 కొట్టగానే మూర్చ వచ్చినట్టు.... 
 మనందరికీ ఎంతో కొంత సైన్స్ తెలుసు.నక్షత్రాలు,గ్రహాలు,ఉపగ్రహాలు,తోకచుక్కలు,గ్రహశకలాలు మొదలైన వాటి గురించి తెలిపే శాస్త్రమే ఖగోళం.మన న్యూ ఇయర్ అంటే "ఉగాది" ఖగోళం ప్రకారం వస్తుంది.జనవరి ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళకు అలా రాదు.వ్యక్తులు నిర్ణయించిన న్యూ ఇయర్ అది.మన పండుగలు అలా కాదు.గడియారం 12 కొట్టగానే మూర్చ వచ్చినట్టు,ఆవేశంగా వూగిపోతూ మన యువకులు వెర్రెక్కిపొతుంటే,వీళ్ళేనా మన వివెకనంద,శివాజీ,రాణాప్రతాప్,భగత్ సింగ్ తమ్ముళ్ళు?క్రికెట్ లో ఇంగ్లాండ్ ని వోడించిన మన భారత క్రికెట్ యోధుల అభిమానులు వీరేనా? 7లక్షల భారతీయ యువకులు 90 సంవత్సరాలు ఆంగ్లేయులతో పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని,ఆ అమరవీరుల ఆత్మల్ని,ఒక్క డిశంబర్ 31 అర్ధరాత్రి రోజునే బ్రిటిష్ వాళ్ళు అందించిన బీరు,బ్రాందీ,విస్కీ బాటిళ్ళతో మన వాళ్ళను మనమే చంపుకుంటున్న యువకులు బహుశా ఏ దేశం లో కూడా ఉండరేమో అనిపిస్తుంది.
Saturday, 28 December 2013
Posted by Sainadh Reddy
Tag :

హ్యాపీ న్యూ ఇయర్

హ్యాపీ న్యూ ఇయర్ ' అని చెప్పకపోతే లోకం ఏమనుకుంటుందోనని భయమేసి కొందరు,జనవరి ఫస్ట్ ఇంగ్లీష్ సంవత్సరమని తెలియక కొందరు,సాగుతున్న ప్రపంచానికి ఎదురుచెప్పలేక కొందరు, ఇంగ్లీష్ వాళ్ళు నేర్పించిన ఈ విధానాన్ని కాపీ కొడుతూ ఎంజాయ్ చేసే విద్యావంతులు ఇంకొందరు మొత్తానికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పక తప్పటం లేదు.చెప్పటం తప్పు అనటం లేదు,కాని ఈ అలవాటు ముదిరిపోయి అంటువ్యాధిగా అందరికి చుట్టుకుంటూన్నది.విదేశీ అనుకరణలు,పిచ్చి అలవాట్లలో కోట్లాది మన యువత అజ్ఞానంతో,శాస్త్రీయమైన మన సంస్కృతిని దూరం చేసుకుంటున్నారనే బాధ అంతటా వ్యాపిస్తున్నది.డిశంబర్ 31 తరువాత వచ్చే జనవరి 1 కి ఎటువంటి అర్థం,శాస్త్రీయత,హేతుబద్ధత,అలాగె ఎటువంటి ఆధారం లేదని మన యువకులకు తెలియాలి. 



'ఖగోళ శాస్త్రం' మన కాలమానానికి ఆధారం.
రోజులు,వారాలు,పక్షాలు,కార్తెలు,మాసాలు,ఋతువులు,ఆయనములు,సంవత్సరములు,పుష్కరాలు,శకాలు,యుగాలు,కల్పాలు....వీటన్నింటినీ ఖగోళం ఆధారంగానే లెక్కిస్తాము.బుద్ధిమంతులు,చదువుకున్న యువకులు,ఏది నిజం,ఏది అబద్దమో తెలుసుకున్నప్పుడే మనం భారతీయులమని అనిపించుకుంటాము.ఇప్పటికినీ ఆంగ్లేయులనే కాపి కొడితే,జిరాక్స్ కాపీలుగా మనం మిగిలిపోతాం తప్ప మనదంటూ స్పెషాలిటీ,అస్తిత్వం లేకుండా పొతుంది.అందుకే డిసంబర్ 31 పోయి,జనవరి 1 రానివ్వండి. దాని కోసం అర్థం లేని సంబరాలు,అనవసర ఖర్చులు,అర్థరాత్రి కేకలు,అరుపులు,త్రాగి ఎగరటాలు,డి జె సౌండ్ తో మన పక్కవాళ్ళను ఇబ్బంది పెట్టటం అవసరమా? మీకు మీరు మీ బుద్ధితో ఆలోచించమని కోరుతున్నాను
Posted by Sainadh Reddy
Tag :

గణపతి పండుగతో అందరికీ విజయమే


గణపతి తో పాటు హిందువుల దేవతలు ఈ భారత భూమిలో స్వాతంత్ర్య సాధనకు చేయూతనిచ్చారు.1905లో పూనా పట్టణంలో విజయదశిమి ఉత్సవంలో 2000విద్యార్థులు,3000పెద్దలు పాల్గొని విదేశీ వస్తు దహనం జరిపి తిలక్ నాయకత్వం లో స్వరాజ్య జ్వాలకు నిప్పుకణికను అందించారు.మన దేశంలో మతం అంటే మత్తుమందు కాదు..నిద్రపోయిన జాతిని మేల్కొల్పిన వేదాంతమిది.ప్రజలకు వినాయకునిలో కూడా జాతిఉద్యమానికి నేతృత్వం వహించిన ప్రజానాయకుడు కనిపించాడంటే, హిందూ మత దేవుళ్ళందరూ స్వాతంత్ర్య పోరాట ప్రేరకులే...ఎన్ని కులాలు,మతాలున్నా అందరిని అన్నదమ్ముల్లా కలిపిన భారత బంధువులే..1630లో జిజియాబాయి తన 12ఏళ్ళ శివాజిని తీసుకుని పూనా పట్టణానికి వచ్చింది. అక్కడ మొఘలుల దౌర్జన్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మావళీలకు స్వేచ్చను ప్రసాదిస్తానని బాలుడు శివాజి హామీ ఇస్తాడు.అక్కడే కనిపించిన గణపతి విగ్రహాన్ని వెలికితీసి,కాస్బా గణపతి మందిరాన్ని జిజియాబాయి నిర్మించింది.ఇక్కడినుండే బాల శివాజీ హిందూ స్వరాజ్య సాధనకు కలలు కని ప్రణాళికలు రచించాడు.గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఆ ప్రేరణతో కదం త్రొక్కాడు.విజయం సాధించాడు.అందుకే మన స్వేచ్చకు అండగా, గణపతి వుండగా మనకెందుకు భయం.
Monday, 9 September 2013
Posted by Sainadh Reddy
Tag :

స్వదేశీకి ప్రేరణ - వినాయకుడి ఆరాధన


ఈస్ట్ ఇండియా కంపనీ మన చిన్న,గ్రామీణ,కుటీర పరిశ్రమలను దెబ్బతీసింది. కోట్ల విలువైన ముడిసరుకును ఈ దేశం నుండి దోచుకునిపోయి,తయారైన వస్తువులను మళ్ళీ మన దేశంలోనె అమ్ముతూ లాభాలు గడించి మన సంపదను లూటీ చేసుకుపోయింది.భారత దేశంలోని వ్యాపార,వాణిజ్య,వ్యవసాయ,గనులు మరియు అటవీ సంపద అంతా తెల్లవాళ్ళ ఆధీనము లోకి రావడానికి చట్టాలు తెచ్చి ఆర్థిక వ్యవస్థను స్వాధీనం చేసుకున్నది.ఈ బ్రిటిష్ వారి కుటిలనీతి అర్థం కాక,సామాన్యులే కాదు విద్యావంతులు కూడ బానిసలై జీవించ సాగారు.అదే సమయం లోనే 1905లో 'విభజించి పాలించు ' అన్న దుర్మార్గ విధానంతో బెంగాల్ ను వంగ విభజన పేరుతో రెండుగా చీల్చే ప్రకటన చేసి దేశంలో చిచ్చుపెట్టారు ఆంగ్లేయులు.ఆ సమయంలొనే చిచ్చుర పిడుగై బాల గంగాధర్ తిలక్, ప్రజల మధ్యలో,ప్రజల భాషలో ఆంగ్లేయుల నయ వంచనను కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ స్వదేశీ ఉద్యమాన్ని అన్ని వైపులా కొనసాగించారు.విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చాడు.తిలక్ కంటే ముందు మహ దేవ గోవింద రానడే డిసంబర్ 1872,ఫిబ్రవరి 1873లలో విదేశీ ఆర్థిక కుట్రలను తన ఉపన్యాసాల ద్వారా చీల్చి చెండాడాడు.అది వారస్వత్వంగా గ్రహించి తిలక్ గణపతి,శివాజి ఉత్సవాల ద్వారా చరిత్రను సృష్టించాడు.అన్ని కులాలను కలిపే మహదవకాశం గణపతి పండుగకు లభించింది.ఇంకేమి కావాలి? అందరూ ఏకమయ్యారు.స్వదేశీ విప్లవ శంఖం పూరించబడింది.ప్రజలు విదేశీ వస్తువులను సేకరించి ఒక దగ్గర్ కుప్పగా పోసి తగులపెట్టారు.ఆంగ్లేయులు నివ్వెరపొయారు.అంతే ...వంగ విభజన ఆగిపోయింది. ప్రజా ఉద్యమానికి నాయకుడు తిలక్ ఐతే ,ప్రజా హృదయాలలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన వాడు వినాయకుడు.అందుకే వినాయకుడా?మజాకా?..
Posted by Sainadh Reddy
Tag :

గణపతి ఆరాధన- శక్తి ఆరాధన


పండితులు,సామాన్యులు,పల్లె ప్రజలు, నగరవాసులు, చిన్నపిల్లలు, యువకులు,వృద్ధులు మొదలైన వారందరూ జట్లు జట్లుగా(గణాలుగా) కలిసివుంటే వారందరికి(ఈ గణాలకు) పతి అంటే నాయకుడు అంటే గణపతిని ముందు నిలిపి,ఆయనను కొలిచి,మన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సాగుతున్న భారత జాతీయ జీవనమిది.అందరిలో ఐక్యతను నిర్మాణం చేయగల బలవంతుడు ఆయన. ప్రజలకు అందుబాటులో వుండే ప్రజానాయకుడూ వినాయకుడు. మన చుట్టూ వున్న పరిస్థితులను చూసి భయపడనవసరం లేకుండా,లోకజ్ఞానం అందించే గొప్పవాడు.పంచ భూతాలతో(భూమి,నీరు,గాలి,అగ్ని, ఆకాశం) నిర్మాణమైన ఈ ప్రకృతిని రక్షించటం మన బాధ్యత.ఏమీ ఇచ్చుకోలేని పేదవాడైనా గడ్డిపరక పెట్టినప్పటికినీ,ఆనందపడే నిరాడంబర దేవుడు ఆయన.ఆ గడ్డిపరకతో అద్భుత జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఆయనను భక్తితో ప్రేమిస్తే చాలు కోరికలు తీర్చగల వినాయకుడు అతడు.పొలాల గట్ల మీద పొతుంటే కనిపించే ఉమ్మెత ఆకు,రేగు ఆకు,తులసి ఆకు,బిల్వ పత్రం,ఉత్తరేణీ,మామిడి,జాజి,రావి,జిల్లెడు,పొద్దుతిరుగుడు,దానిమ్మ,వావిలాకు,జమ్మీ మరియు గన్నెరు ఆకులతో పూజిస్తె పొంగిపోతాడు. ఈ చెట్లన్నిటిని రక్షించాలనే అర్థం ఇందులో లేదా? ఆయనకు పెట్టే వస్తువులోనైనా రసాయన పదార్థాలు లేవు.అన్ని సహజంగా ప్రకృతి ఇచ్చినవే కదా?బియ్యము,కొబ్బరితో చేసిన కుడుములు ఆరోగ్యానికి మంచిది.పసుపు యాంటిసెప్టిక్,కుంకుమ,గంధం చల్లదనానికి సంకేతం.ఆయన ముందు కూర్చుని ప్రార్థించటమంటే,అనంతమైన ఆ శక్తివంతుడిని నుండి జన్మించిన మనం,ఆ శక్తిని మనకు ప్రసాదించాలని,మన ఆశయాలను నెరవేర్చాలని,విఘ్నములుకలుగకుండా ఆశీర్వదించాలని అర్థం
Posted by Sainadh Reddy
Tag :

వినాయక చవితి - జాతీయ పండుగ


1857 ప్రథమ స్వాతంత్ర్య సమరం జరుగుతున్న రోజులు.గణపతి అందరి దేవుడిగా పూజలందుకుంటూ వీధి,వీధిన తిరుగుతుంటే భారతీయ సంస్కృతి,దేశభక్తి భావన ప్రజల్లో పెల్లుబుకుతున్నది.పీష్వాల కులగురువుగా పూజలందుకున్న గణపతి బ్రాహ్మణుడు మొదలుకుని అన్ని కులాల ఆరాధ్య దేవతగా అవతరించాడు.సామాన్య ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటూ వుంటే,జాతీయ నాయకులు తమ ఉపన్యాసాలతో బ్రిటిష్ వారి ఉక్కు పిడికిళ్ళ నుండి భరతమాతకు స్వేచ్చ ను ప్రసాదించడానికి అందరికి ప్రేరణ ఇస్తున్నారు. 1893 లో ఒక వైపు స్వామివివేకానంద చికాగో సభ ద్వారా భారతీయుల గత వైభవ శంఖాన్ని పూరిస్తే,మరోవైపు ఆ స్వామీజి ప్రేరణతో బాల గంగాధర తిలక్ మొట్ట మొదటి గణపతిని వీధుల్లో ప్రతిస్ఠాపించి స్వరాజ్య ఢంకా మ్రోగించాడు.మొదట మహరాష్ట్రా వరకే పరిమితమై,నెమ్మదిగా గోవా,కొంకణ్, తమిళ నాడు,కర్నాటక,ఆంధ్రప్రదేశ్ లలో ఘనంగా జరుపుకుంటూ నేడు ప్రపంచ దేశాలన్నింటిలో అన్ని వర్గాల్లో ఆధ్యాత్మికత, జాతీయ మరియు వేదాంత భావనలు నింపుతున్న పండుగ ఇది.
Posted by Sainadh Reddy
Tag :

మరో స్వాతంత్ర్య ఉద్యమానికి పిలుపు- గణపతి ఉత్సవాలు


1630-1680 కాలం నుండి శివాజి ఆధ్వర్యంలో ప్రప్రథమంగా పూనా నగరంలో బహిరంగంగా ఒక సామాజిక పండుగగా మొదలై నేటికీ గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒక మరాఠా యోధుడిగా చత్రపతి శివాజి నడిపించిన ఈ ఉత్సవాలు ఆ తరువాత పీష్వాల కాలం వరకు అంటే 1749 నుండి 1818 వరకు కొనసాగుతూ వచ్చాయి.పీష్వాల కాలం ముగిసిన తరువాత గణపతి ఆరాధన ఇళ్ళకు మాత్రమే పరిమితమయ్యాయి.స్వాతంత్ర్య సమర యోధుడైన బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ వాళ్ళ పెత్తనం నుండి భారత్ కు విముక్తిని ప్రసాదించడానికి ,భారతీయులలో స్వాభిమానాన్ని పెంచడానికి మళ్ళీ గణేశ్ ఉత్సవాలను మొదలుపెట్టాడు.ఒక్కరొక్కరు మొన్నటి వరకు ఇంటి పూజకు పరిమితమైన వాళ్ళు, నేడు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి భక్తి మరియు దేశభక్తి ని కలగలిపి ఐక్యతను చాటిచెప్పారు.తీలక్ చేతులమీదుగా వీధుల్లో గణపతి మండపాలు మొదలయ్యాయి.ఆ మండపాల వద్ద కవి సమ్మేళనాలు,నాటకాలు,వీధి భాగోతాలు,జానపద గేయాలు,నృత్యాలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా స్వదేశీ ఉద్యమానికి ఒక ఊపునిచ్చాడు. ఆ విధంగా మహరాష్ట్ర నుండి మొదలై దేశం అన్ని వైపులా ఈ ఉత్సవాలు విస్తరించాయి.లక్షలాది మంది యువకులు వీధుల్లోకి వచ్చి, నినాదాలు చేస్తుంటే బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారిగా భయపడిపోయింది.గణపతి పండుగలో వున్న గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.
Sunday, 8 September 2013
Posted by Sainadh Reddy
Tag :

మళ్ళీ స్వదేశీ ఉద్యమం


Source: ఈనాడు దినపత్రిక (07-09-2013)
Posted by Sainadh Reddy
Tag :

రూపాయి పతనం-12


విదేశీ దిగుమతులపై ఆధారపడే ఏ దేశమైనా ప్రమాదంలో ఇరుక్కోవలసిందే అనడానికి మన దేశం మంచి ఉదాహరణ.ఎందుకంటే వస్తువులు దిగుమతి చేసుకోవాలంటే విదేఅశ మారక ద్రవ్యం కావాలి అంటే డాలర్లు వుండి వుండాలి.అవి సంపాదించాలంటే మనము కూడా మన దేశ వస్తువులు ఎగుమతి చేస్తేనే డాలర్లు లభిస్తాయి.కాని మన స్వదేశీ పరిశ్రమలు ప్రోత్సాహం లేక మూతపడే స్థితిలో వున్నయి.కాబట్టి విదేశీ మారక ద్రవ్యం సంపాదించలేము.కాబట్టి సేవలను (సాఫ్ట్ వేర్ ఉత్పత్తులు )ఎగుమతి చేయాలి.అయితే అభివృద్ధి చెందిన దేశాల నుండి గట్టి పోటిని ఎదుర్కొనవలసి వస్తుంది.అందువల్ల ఖనిజాలు ,ముడిసరుకులు, మానవ వనరులను ఎగుమతి చేయవలసి వస్తుంది.గతంలో ఆఫ్రికా దేశాలు బానిసలను ఎగుమతి చేసి దుస్థితిని గుర్తుకు తెచ్చుకోవాలి.బానిసల వ్యాపారం అనాగరికం.విదేశీ మారక ద్రవ్యం కోసం ఎంతో మంది పేదవారు గల్ఫ్,అంగోలా,ఈజిప్ట్ వంటి దేశాల్లొ కడు దయనీయమైన బ్రతుకు సాగిస్తున్నారు.ఇంతచేసినా విదేశీ మారక ద్రవ్యం లభించటం లేదు.కాబట్టి ఎక్కువ అప్పు చేయటం,ప్రభుత్వమే కాక ప్రజలను, ప్రైవేట్ సంస్థలను విదేశీ అప్పులు తీసుకోవడానికి ప్రోత్సహించటం జరుగుతున్నది.విదేశీ పెట్టుబడులను రప్పించడానికి ప్రయత్నాలు ఎన్ని చేసినా డాలర్ డిమాండ్ పెరగటంతో,రూపాయి పతనం ఆపలేకపొతున్నారు.
Posted by Sainadh Reddy
Tag :

రూపాయి పతనం-11

రూపాయి విలువ పడిపోయింది కాబట్టి దాని ఫలితాలు రుచి చూడవలసిందే కదా.వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.ద్రవ్యోల్బణం పెరిగింది.వాణిజ్య లోటు,డ్రవ్య లోటు,బడ్జెటు లోటు,రెవెన్యూ లోటు పెరిగి,ఖర్చులు పెరిగాయి.మార్కెట్లు నష్టాలు ఎదుర్కొంటున్నాయి.ఉత్పత్తి తగ్గిపోయింది.వస్తువుల వినియోగం పెరిగిపోయింది. ఇవన్నీ చూస్తుంటే 1991 నాటి పూర్వ సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి.స్వాతంత్ర్యం తరువాత మన స్వదేశీ ఉత్పత్తి రంగాన్ని పట్టించుకోని కారణంగా,విదెశీ విధానాలు మన కొంప ముంచాయి.వంద కోట్ల జనాభా వున్నా కూడా ఒక నలుగురి ఆర్థిక వేత్తలనబడే మన్మొహన్ సింగ్ ,చిదంబరం,ప్రణబ్ ముఖర్జీ మరియు మోంటెక్ సింగ్ ఆహ్లూవాలియా వంటి వాళ్ళపై దేశ ఆర్థిక వ్యవస్థను వుంచేసి మనం చేతులు దులుపుకోవలసిందేనా?
Posted by Sainadh Reddy
Tag :

రూపాయి పతనం-10


ఏ దేశానికైనా దాని కరెన్సీ,ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది.ప్రపంచ దేశాల మధ్య జరిగే వస్తు ఎగుమతి దిగుమతుల కు ఈ రోజు డాలర్ ప్రధాన వాహికగా గుర్తింపు పొందింది.మన దేశంతో పాటు మిగతా దేశాల కరెన్సీలపై కూడా దీని ప్రభావం వుంది. స్విట్జర్లాండ్ "స్విస్ ఫ్రాంక్ " డాలర్ తో పోలిస్తే 2శాతం విలువ ఎక్కువగ వుండి, ప్రపంచంలోనె ఎక్కువ తలసరి ఆదాయం గల దేశంగా పెట్టుబడిదారులను ఆకర్శిస్తున్న దేశం ఇది. గ్రేట్ బ్రిటన్ యొక్క 'పౌండ్ స్టెర్లింగ్'డాలర్ తో పోలిస్తే 1.7శాతం విలువ ఎక్కువ.ప్రపంచంలోనే అత్యంత గ్లోబలైజ్డ్ ఆర్థిక వ్యవస్థ గల దేశమిది. జపాన్ యొక్క 'యెన్" డాలర్ తో 0.6శాతం విలువ ఎక్కువ.ఆటొమొబైల్ మరియు ఎలెక్ట్ర్రానిక్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే మూడవ దేశంగా పేరు పొందింది. ఇది ఇలా వుంటే మన దేశం యొక్క రూపాయి విలువ 15శాతం తగ్గిందంటే అన్ని దేశాలకంటే మనది దిగజారిన ఆర్థిక వ్యవస్థకు అద్దం పడుతుంది.మన తరువాతి దేశమైన బ్రెజిల్ దేశం యొక్క "బ్రెజిలియన్ రియల్ ' 15.4 శాతం విలువ తగ్గిందన్న అంశం మనకు సంతోషం కలిగిస్తుందేమో.
Posted by Sainadh Reddy
Tag :

మన దేశం వలే కరెన్సీ విలువ పడిపోయిన దేశాలు


ఆస్త్రేలియన్ డాలర్ 11.7శాతం, సౌత్ ఆఫ్రికన్ రాండ్ 11.5శాతం, టర్కిష్ లిరా 11శాతం, థాయి బహత్ 11శాతం, మెక్సికన్ పెసో 6.7శాతం, న్యూజిలాండ్ డాలర్ 5.8శాతం, నార్వేజియన్ క్రొనే 3.1శాతం, కెనడియన్ డాలర్ 3శాతం, సౌత్ కొరియన్ వన్ 1శాతం, తైవాన్ డాలర్ 1శాతం , స్వీడిష్ క్రోనా 0.2శాతం,ఈ విధంగా ఈ దేశాలు డాలర్ తో ప్రభావానికి గురయ్యాయి. 
 1990 లో 1డాలర్ కి 18.11 రూపాయలు,
1991 లో 29.79రూపాయలు,
1992లో 28.95 రూపాయలు,
1993లో 31.44రూపాయలు,
1994లో 31,39రూపాయలు,
1995లో 34.92రూపాయలు,
1996లో 35.83రూపాయలు,
 1997లో 39.15రూపాయలు,
1998లో 42.58రూపాయలు,
1999లో 43.45రూపాయలు,
2000లో 46.88రూపాయలు,
2001లో 47.93రూపాయలు,
2002లో 48.23రూపాయలు,
2003లో 45.66రూపాయలు కాగా 
ఇప్పుదు 2013 లో 68.80రూపాయలు విలువ తగ్గింది. 
గమ్మత్తేమిటంటే 1947లో మన కరెన్సీ విలువ 1డాలర్ కి 1రూపాయి వుండేది.
Posted by Sainadh Reddy
Tag :

దాదాభాయి నౌరోజీ ప్రకటించిన నాలుగు సూత్రాలు


విదేశీ వస్తువులను బహిష్కరించండి అనగానె అది నెగెటివ్ గా అనిపిస్తుంది కదా.విలాస జీవితాలను కొరుకునేవాళ్ళకు,మంచి పాష్ గా వుందే వాళ్ళకు విదేశీవస్తువులను బహిష్కరించాలని అనగానే అదోలా అనిపిస్తుంది.కాని 1906లో కలకత్తా లో కాంగ్రెస్ సభలో అధ్యక్షత వహించిన దాదాభాయి నౌరోజీ అత్యంత విలాస వంతుడు అయినప్పటికి ఆయన ప్రకటించిన నాలుగు సూత్రాల్లో 
1.స్వరాజ్యము,
2.జతీయ విద్య,
3.స్వదేశీ,
4.విదేశి వస్తు బహిష్కరణ 
అని పిలుపు ఇచ్చాదంటే మీరు అర్థం చేసుకొండి.దేశం కోసం వాళ్ళ వ్యక్తిగత సుఖాలను త్యాగం చేశారు ఆ రొజుల్లో.ఆ రొజు నుండి కూడా స్వదేశీ ఆచరిస్తే ప్రయోజనం కలుగుతుందనే నమ్మకం,సంకల్పం తక్కువగానె వున్నా స్వదేశీ అమలు చేస్తేనే మన రూపాయి బలంగా వుండి ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.
Posted by Sainadh Reddy
Tag :

జపాన్


సుమారు 25-30 సంవత్సరాల క్రితం జపాన్ ఆర్థికంగా బలహీనంగా వుండి,అమెరికా ప్రభావం లొ వుంటూ అమెరికా చెప్పినట్లు వినే సమయంలో అమెరికా ప్రభుత్వం జపాన్ ప్రభుత్వంతో "మీ జపాన్ మహిళలకు అమెరికా సంత్రాలు(పండ్లు)అంటే ఇష్టం కాబట్టి సంత్రాలు దిగుమతి చేసుకోవాలని అమెరిక సూచిస్తుంది.కాని జపాన్ ఆ సూచనను తిరస్కరిస్తుంది.అయినప్పటికి అమెరికా సంత్రాలను జపాన్ మార్కెట్ కి ఎగుమతి చేస్తుంది.గమ్మత్తేమిటంటే జపాన్ మర్కెట్లోని ఒక్క పండు కూడా అమ్ముడుపోదు.జపాన్ మహిళలకు సంత్రాలు ఇష్టం కావచ్చునేమో కాని జపాన్ ఆర్థిక వ్యవస్థ కోసం తమ ఇష్టాలను త్యగం చేశారు.అందుకే ఈ రొజు జపాన్ దేశం ప్రపంచ దేశాల్లొ 3వ బలమైన ఆర్థిక దేశంగా వెలుగుతుంది.
Posted by Sainadh Reddy
Tag :

గాంధీజీ అనుసరించిన స్వదేశీ ఉద్యమం


ఒకసారి గాంధీ మరియు ఇర్విన్ ప్యాక్ట్ కి సంబంధించిన చర్చ ఆ ఇద్దరి మధ్య జరుగుతుంది. వైస్రాయి కోసం 'టీ' వచ్చింది.గాంధీజీ కోసం నిమ్మరసం తెచ్చారు.వైస్రాయి ఇదంతా చూస్తూ ఉన్నాడు.గాంధీజీ తన దగ్గర వున్న ఒక పొట్లం విప్పాడు.తెచ్చిన నిమ్మరసంలొ పొట్లం తెరిచి పొడిని ఆ నిమ్మరసంలో వేశాడు.వెంటనే వైస్రాయి అడిగాడు.'ఏమిటిదీ? అని.అప్పుడు గాంధీజి జవాబు చెపుతూ 'ఉప్పు పై మీరు వేసిన పన్నుకు వ్యతిరేకంగా,ఉప్పు సత్యాగ్రహం పేరుతో మీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ నేను తయారు చేసిన ఉప్పును నిమ్మ రసంలో వేసి త్రాగుతున్నానూఅని అంటాడు.ఇది గాంధీజీ అనుసరించిన స్వదేశీ ఉద్యమానికి ఉదాహరణ.
Posted by Sainadh Reddy
Tag :

సర్వేపల్లి రాధాక్రిష్ణ


సర్వేపల్లి రాధాక్రిష్ణ రాష్ట్రపతిగా 1962లో ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే ,మాన్వత్వం లేని చైనా దొంగ చాటుగా యుద్ధానికి దిగింది.ఆయన పదవీకాలంలోనే 1965లో కర్కశ పాకిస్తాన్ దాడి చేసింది.ఈ రెండు యుద్ధ సమయాల్లో కీలక పాత్రను ఆయన పోషించారు.రష్యా కు వెళ్ళి స్టాలిన్ తో మాట్లాడిన తీరు, నిరంకుశుడు స్టాలిన్ లో గొప్ప మార్పు ను తెచ్చింది.రక్తపాతం సృస్టించిన రాజు అశోకుడు,ఆ తరువాత బుద్దుడుగా మారిన సంఘటన చెప్పగానే స్టాలిన్లో అనుకోని మానవత్వం పరిమళించింది.స్టాలిన్ మాట్లాడుతూ 'మీరు కలకాలం జీవించాలని,తాను త్వరలోనే మరణిస్తాననీ అంటాడు.ఆ తరువాత 6నెలలకు స్టాలిన్ మరణిస్తాడు.స్టాలిన్ లో మానవత్వాన్ని నింపిన రాధాక్రిష్ణన్ గొప్పతనం మనకు అర్థమవుతుంది..20సంవత్సరాల వయస్సులోనే ఎం.ఎ.ఫిలాసఫీ పూర్తిచేసాడు. ఆంధ్ర మరియు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయాలకు ఉపకులపతి గా వుంటూ విద్యా రంగానికి ఎనలేని సేవ చేశాడు.సెప్టెంబర్ 5న(1888)జన్మించి,ఏప్రిల్ 17,1975లో పరమపదించాడు.రామాయణం,భారతం,ఉపనిషత్తులు,భగవద్గీత,శంకర,రామానుజ,మధ్వాచార్యుల రాసిన భాష్యాలను అధ్యయనం చేసి నిష్ణాతుడయ్యాడు. ఆయన పుట్టినరోజు మనకు ఉపాధ్యాయ దినం.శ్రీ గురుభ్యొనమ
Posted by Sainadh Reddy
Tag :

ఉపాధ్యాయ దినోత్సవం రొజున చాణక్యుని అమృత సూక్తులు


ఉపాధ్యాయుడికి సమాజంలో నిజమైన గౌరవం ఎప్పుడు లభిస్తుంది.గౌరవమెప్పుడంటే,భారత దేశం గౌరవశాలిగా వున్నప్పుడు మాత్రమే.దేశం గౌరవశాలిగా ఎప్పుడవుతుందంటే ఈ దేశం తన ప్రాచీన జీవన మూల్యాలను నిర్వహించడంలొ సామర్థ్యం మరియు సఫలత పొందినప్పుడు. ఆ దేశం సామర్థ్యం,సఫలత ఎప్పుడు పొందుతుందంటే,ఉపాధ్యాయులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించటంలో సఫలత సాధించినప్పుడు మాత్రమే.ఆ సఫలతను ఉపాధ్యాయుడు ఎప్పుడు పొందగలడంటే,ఆ ఉపాధ్యాయుడు ప్రతివ్యక్తి హృదయములొ దేశభక్తిని నింపినప్పుడు మాత్రమే.ఒక వేళ వ్యక్తిలో దేశభక్తి లేకపొయినా, దేశం పట్ల హీన భావన వున్నా, దేశం గురించి జాగృత భావన లేకున్నా, అది ఉపాధ్యాయుడి అసఫలతకు ఉదాహరణగా పేర్కొనవచ్చును.జాతీయ శీలం లేని కారణంగా దేశం నేడు ఎన్నో అవమానాలకు గురవుతున్న అనుభవాలు ఎన్నో చూస్తున్నాము.మన శత్రుదెశాలు మనపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నప్పుడల్లా,ఆయుధాలకంటే ముందు మనం మన విలువగల మంచి పుస్తకాల అద్యయనం కొరవడి,అజ్ఞానులమయ్యాము.ఆయుధాలు ధరించి ,శాస్త్రజ్ఞానం కలిగించతం లెదు కాబట్టి,దేశం విభజనకు గురయ్యింది.ఉపాధ్యాయులు దేశం యొక్క సామర్థ్యాన్ని జాగృతం చేయడంలో విఫలం చెందారు.మన పాఠ్య పుస్తకాలతో పాటు,వేద వందనంతో పాటు మన దేశ వందనం కూడా అన్ని వైపులా ప్రతిధ్వనించాలి. వ్యక్తికి దేశాన్ని ఆరాధించటం పట్ల ప్రేమ,శ్రద్ధ లేనట్లయితే,,మిగతా మార్గాలన్నింటిలోనూ సంఘర్షణ తప్పదు.అందుకే వ్యక్తి-వ్యక్తితో,వ్యక్తి-సమాజంతో,సమాజం- దేశంతో కలిసి ఏకత్వంతో సాగాలి.వ్యక్తి త్వరగా సమాజాన్ని దేశంతో ఏకతా సూత్రంతో బంధించాలి.అది దేశభక్తి తో మాత్రమే సాధ్యమవుతుంది.అందుకే వెంటనే ఉపాధ్యాలు ఈ సవాళ్ళను స్వీకరించి దేశ నిర్మాణానికి సిద్ధంగా వుండాలి.ఈ విషయంలో తప్పకుండా ఆటంకాలు ఎదురవుతాయి.అయినప్పటికినీ దీనిలో ఉపాధ్యాయులు విజయం సాధించవలసిందే.
Posted by Sainadh Reddy
Tag :

దేశభక్తిని ప్రజల్లొ నిర్మాణం చేయటం కష్టమా?


విదేశీ సహాయం లేకుండా మనపై మనకు నమ్మకముండి ఎమైనా చేయలేమా?ఎందుకో గాని ఆ విశ్వాసమే మనకు కలగటం లేదు.అన్ని పనులు మనం చేసుకోకపోవచ్చును.జపాన్,జర్మనీ ల వలే అద్భుతాలు సృష్టించడానికి,కావలసిన దేశభక్తిని ప్రజల్లొ నిర్మాణం చేయటం కష్టమా?మన ప్రభుత్వం ఇది కలిగించటం ఊహించగలదా?మన ఆర్థిక వ్యవస్థ బలంగా సాగటానికి కావల్సింది పెట్టుబడి అయితే,ఆ పెట్టుబడిని మనం పొదుపు చేయటం ద్వారా సాధించగలము.మనం గుర్తించటం లేదు కాని మన కుటుంబం అనే వ్యవస్థ కారనంగా మనం ఇప్పటికే 38శాతం పైగా పొదుపు చేసాము.ఇంత రేటు అమెరికా,యూరప్ దేశాల్లొ లేదంటే ఆశ్చర్యం వేస్తుంది.అమెరీకా పొదుపు రేటు (-)0.4 కి చేరింది.మన పొదుపు కారణంగా సుమారు 12లక్షల కోట్ల రుపాయలు మన వద్ద మూలధనం వుందంటే మామూలు విషయం కాదు కదా?విదేశాలను బిచ్చమెత్తవలసిన పనిలేదు కదా? ఆత్మస్థైర్యం పెంచుకుని,సృజనాత్మకతతో అభివృద్ధిమార్గంలో ప్రయాణం చేయవచ్చును.మన అవసరాలకు కావలసిన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి.చిన్నచిన్న వస్తువులన్నిటికి విదేశాలపై ఆధారపడకూడదు.ఏదైన విజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవలసి వస్తే, మన పరిస్తితులకు అనుగుణంగా మార్చుకుని,ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా,ఆర్థిక వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా నడిపించాలి.దేశ ఆర్థిక వ్యవస్థ 4 గురు మంత్రుల చేతుల్లో కాదు,ప్రతి భారతీయుడికి ఇందులో భాగస్వామ్యం వుందని అర్థం చేసుకోవాలి
Saturday, 7 September 2013
Posted by Sainadh Reddy
Tag :

భారత ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకుంటున్న పాలకులు


గొప్ప ఆర్థిక వేత్త అయిన మన ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని అయి 9సంవత్సరాల తరువాత మనము ఇప్పటి వరకు దిగుమతుల ద్వారా విదేశీ వస్తువులు వరదలా దేశాన్ని ముంచెత్తి,మనం చెల్లించవలసిన బిల్లు ఎంతో తెలుసా..అక్షరాలా మూడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. ఇందులో రొజూ మనము వినియోగించుకొనే సామాన్య వస్తువులే.ఇవి మన దేశంలొ ఉత్పత్తి చేసుకోవచ్చును.చైనా నుండి వస్తువుల దిగుమతి కోసం చర్చలు సాగిస్తుంది.ఇంకా 34దేశాలతో వ్యాపార చర్చలు సాగుతున్నాయి.అంటే దిగుమతి వస్తువులకు భారత ద్వారాలు 24గంటలు తెరిచివుంచుతారన్నమాట.మన దేశహితం కాని లేని చర్చలతో ప్రభుత్వం కాలం వెళ్ళబుచ్చుతుంది.యూరోపీయ దేశాలతో ఇటీవల జరిగిన చర్చల్లో,ఆ దేశాలవారు తమ దేశాల్లో ఉత్పత్తి అయిన మద్యం పై భారత్ దిగుమతి సుంకంలో కోత విధించాలని,అలాగే దిగుమతి అవుతున్న పాల ఉత్పత్తుల్లో కూడా 60శాతం నుండి 10శాతం దిగుమతి సుంకం తగ్గించాలని ఒత్తిడి తెస్తున్నది.మన ప్రభుత్వం దానికి ఒప్పుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.దిగుమతి అవుతున్న వంట నూనెల పై 300శాతం నుండి 0జీరో శాతం తగ్గించిన కారణంగా,ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకుంటున్న నూనె బిల్లు 60,000కోట్లు చెల్లిస్తున్నాము.మనము అనుసరిస్తున్న విదేశీ విధానాల వల్ల ఇప్పటికే 1కోటి 40లక్షల రైతులు వ్యవసాయం వదలి వలస వెళ్ళారు. మరో వైపు సుమారు 53లక్షల ఉద్యోగులు,ఉపాధి పోయి వీధి పాలయ్యారు. ఇవన్నీ గమనించి,మనకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందా అని అనుమానం వస్తుంది.
Posted by Sainadh Reddy
Tag :

In the Service of Mother INDIA

Popular Post

Total Visitors

- Copyright © స్వదేశీ జాగరణ మంచ్ Powered by Blogger - Designed by Sainadh Reddyn -