- Back to Home »
- Articles »
- వినాయక చవితి - జాతీయ పండుగ
Posted by : Sainadh Reddy
Monday, 9 September 2013
1857 ప్రథమ స్వాతంత్ర్య సమరం జరుగుతున్న రోజులు.గణపతి అందరి దేవుడిగా పూజలందుకుంటూ వీధి,వీధిన తిరుగుతుంటే భారతీయ సంస్కృతి,దేశభక్తి భావన ప్రజల్లో పెల్లుబుకుతున్నది.పీష్వాల కులగురువుగా పూజలందుకున్న గణపతి బ్రాహ్మణుడు మొదలుకుని అన్ని కులాల ఆరాధ్య దేవతగా అవతరించాడు.సామాన్య ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటూ వుంటే,జాతీయ నాయకులు తమ ఉపన్యాసాలతో బ్రిటిష్ వారి ఉక్కు పిడికిళ్ళ నుండి భరతమాతకు స్వేచ్చ ను ప్రసాదించడానికి అందరికి ప్రేరణ ఇస్తున్నారు. 1893 లో ఒక వైపు స్వామివివేకానంద చికాగో సభ ద్వారా భారతీయుల గత వైభవ శంఖాన్ని పూరిస్తే,మరోవైపు ఆ స్వామీజి ప్రేరణతో బాల గంగాధర తిలక్ మొట్ట మొదటి గణపతిని వీధుల్లో ప్రతిస్ఠాపించి స్వరాజ్య ఢంకా మ్రోగించాడు.మొదట మహరాష్ట్రా వరకే పరిమితమై,నెమ్మదిగా గోవా,కొంకణ్, తమిళ నాడు,కర్నాటక,ఆంధ్రప్రదేశ్ లలో ఘనంగా జరుపుకుంటూ నేడు ప్రపంచ దేశాలన్నింటిలో అన్ని వర్గాల్లో ఆధ్యాత్మికత, జాతీయ మరియు వేదాంత భావనలు నింపుతున్న పండుగ ఇది.