- Back to Home »
- Articles »
- గణపతి ఆరాధన- శక్తి ఆరాధన
Posted by : Sainadh Reddy
Monday, 9 September 2013
పండితులు,సామాన్యులు,పల్లె ప్రజలు, నగరవాసులు, చిన్నపిల్లలు, యువకులు,వృద్ధులు మొదలైన వారందరూ జట్లు జట్లుగా(గణాలుగా) కలిసివుంటే వారందరికి(ఈ గణాలకు) పతి అంటే నాయకుడు అంటే గణపతిని ముందు నిలిపి,ఆయనను కొలిచి,మన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సాగుతున్న భారత జాతీయ జీవనమిది.అందరిలో ఐక్యతను నిర్మాణం చేయగల బలవంతుడు ఆయన. ప్రజలకు అందుబాటులో వుండే ప్రజానాయకుడూ వినాయకుడు. మన చుట్టూ వున్న పరిస్థితులను చూసి భయపడనవసరం లేకుండా,లోకజ్ఞానం అందించే గొప్పవాడు.పంచ భూతాలతో(భూమి,నీరు,గాలి,అగ్ని, ఆకాశం) నిర్మాణమైన ఈ ప్రకృతిని రక్షించటం మన బాధ్యత.ఏమీ ఇచ్చుకోలేని పేదవాడైనా గడ్డిపరక పెట్టినప్పటికినీ,ఆనందపడే నిరాడంబర దేవుడు ఆయన.ఆ గడ్డిపరకతో అద్భుత జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఆయనను భక్తితో ప్రేమిస్తే చాలు కోరికలు తీర్చగల వినాయకుడు అతడు.పొలాల గట్ల మీద పొతుంటే కనిపించే ఉమ్మెత ఆకు,రేగు ఆకు,తులసి ఆకు,బిల్వ పత్రం,ఉత్తరేణీ,మామిడి,జాజి,రావి,జిల్లెడు,పొద్దుతిరుగుడు,దానిమ్మ,వావిలాకు,జమ్మీ మరియు గన్నెరు ఆకులతో పూజిస్తె పొంగిపోతాడు. ఈ చెట్లన్నిటిని రక్షించాలనే అర్థం ఇందులో లేదా? ఆయనకు పెట్టే వస్తువులోనైనా రసాయన పదార్థాలు లేవు.అన్ని సహజంగా ప్రకృతి ఇచ్చినవే కదా?బియ్యము,కొబ్బరితో చేసిన కుడుములు ఆరోగ్యానికి మంచిది.పసుపు యాంటిసెప్టిక్,కుంకుమ,గంధం చల్లదనానికి సంకేతం.ఆయన ముందు కూర్చుని ప్రార్థించటమంటే,అనంతమైన ఆ శక్తివంతుడిని నుండి జన్మించిన మనం,ఆ శక్తిని మనకు ప్రసాదించాలని,మన ఆశయాలను నెరవేర్చాలని,విఘ్నములుకలుగకుండా ఆశీర్వదించాలని అర్థం