Posted by : Sainadh Reddy Sunday, 8 September 2013


1630-1680 కాలం నుండి శివాజి ఆధ్వర్యంలో ప్రప్రథమంగా పూనా నగరంలో బహిరంగంగా ఒక సామాజిక పండుగగా మొదలై నేటికీ గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒక మరాఠా యోధుడిగా చత్రపతి శివాజి నడిపించిన ఈ ఉత్సవాలు ఆ తరువాత పీష్వాల కాలం వరకు అంటే 1749 నుండి 1818 వరకు కొనసాగుతూ వచ్చాయి.పీష్వాల కాలం ముగిసిన తరువాత గణపతి ఆరాధన ఇళ్ళకు మాత్రమే పరిమితమయ్యాయి.స్వాతంత్ర్య సమర యోధుడైన బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ వాళ్ళ పెత్తనం నుండి భారత్ కు విముక్తిని ప్రసాదించడానికి ,భారతీయులలో స్వాభిమానాన్ని పెంచడానికి మళ్ళీ గణేశ్ ఉత్సవాలను మొదలుపెట్టాడు.ఒక్కరొక్కరు మొన్నటి వరకు ఇంటి పూజకు పరిమితమైన వాళ్ళు, నేడు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి భక్తి మరియు దేశభక్తి ని కలగలిపి ఐక్యతను చాటిచెప్పారు.తీలక్ చేతులమీదుగా వీధుల్లో గణపతి మండపాలు మొదలయ్యాయి.ఆ మండపాల వద్ద కవి సమ్మేళనాలు,నాటకాలు,వీధి భాగోతాలు,జానపద గేయాలు,నృత్యాలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా స్వదేశీ ఉద్యమానికి ఒక ఊపునిచ్చాడు. ఆ విధంగా మహరాష్ట్ర నుండి మొదలై దేశం అన్ని వైపులా ఈ ఉత్సవాలు విస్తరించాయి.లక్షలాది మంది యువకులు వీధుల్లోకి వచ్చి, నినాదాలు చేస్తుంటే బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారిగా భయపడిపోయింది.గణపతి పండుగలో వున్న గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

In the Service of Mother INDIA

Popular Post

Total Visitors

- Copyright © స్వదేశీ జాగరణ మంచ్ Powered by Blogger - Designed by Sainadh Reddyn -