- Back to Home »
- Articles »
- గణపతి పండుగతో అందరికీ విజయమే
Posted by : Sainadh Reddy
Monday, 9 September 2013
గణపతి తో పాటు హిందువుల దేవతలు ఈ భారత భూమిలో స్వాతంత్ర్య సాధనకు చేయూతనిచ్చారు.1905లో పూనా పట్టణంలో విజయదశిమి ఉత్సవంలో 2000విద్యార్థులు,3000పెద్దలు పాల్గొని విదేశీ వస్తు దహనం జరిపి తిలక్ నాయకత్వం లో స్వరాజ్య జ్వాలకు నిప్పుకణికను అందించారు.మన దేశంలో మతం అంటే మత్తుమందు కాదు..నిద్రపోయిన జాతిని మేల్కొల్పిన వేదాంతమిది.ప్రజలకు వినాయకునిలో కూడా జాతిఉద్యమానికి నేతృత్వం వహించిన ప్రజానాయకుడు కనిపించాడంటే, హిందూ మత దేవుళ్ళందరూ స్వాతంత్ర్య పోరాట ప్రేరకులే...ఎన్ని కులాలు,మతాలున్నా అందరిని అన్నదమ్ముల్లా కలిపిన భారత బంధువులే..1630లో జిజియాబాయి తన 12ఏళ్ళ శివాజిని తీసుకుని పూనా పట్టణానికి వచ్చింది. అక్కడ మొఘలుల దౌర్జన్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మావళీలకు స్వేచ్చను ప్రసాదిస్తానని బాలుడు శివాజి హామీ ఇస్తాడు.అక్కడే కనిపించిన గణపతి విగ్రహాన్ని వెలికితీసి,కాస్బా గణపతి మందిరాన్ని జిజియాబాయి నిర్మించింది.ఇక్కడినుండే బాల శివాజీ హిందూ స్వరాజ్య సాధనకు కలలు కని ప్రణాళికలు రచించాడు.గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఆ ప్రేరణతో కదం త్రొక్కాడు.విజయం సాధించాడు.అందుకే మన స్వేచ్చకు అండగా, గణపతి వుండగా మనకెందుకు భయం.