Posted by : Sainadh Reddy Saturday, 28 December 2013

హ్యాపీ న్యూ ఇయర్ ' అని చెప్పకపోతే లోకం ఏమనుకుంటుందోనని భయమేసి కొందరు,జనవరి ఫస్ట్ ఇంగ్లీష్ సంవత్సరమని తెలియక కొందరు,సాగుతున్న ప్రపంచానికి ఎదురుచెప్పలేక కొందరు, ఇంగ్లీష్ వాళ్ళు నేర్పించిన ఈ విధానాన్ని కాపీ కొడుతూ ఎంజాయ్ చేసే విద్యావంతులు ఇంకొందరు మొత్తానికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పక తప్పటం లేదు.చెప్పటం తప్పు అనటం లేదు,కాని ఈ అలవాటు ముదిరిపోయి అంటువ్యాధిగా అందరికి చుట్టుకుంటూన్నది.విదేశీ అనుకరణలు,పిచ్చి అలవాట్లలో కోట్లాది మన యువత అజ్ఞానంతో,శాస్త్రీయమైన మన సంస్కృతిని దూరం చేసుకుంటున్నారనే బాధ అంతటా వ్యాపిస్తున్నది.డిశంబర్ 31 తరువాత వచ్చే జనవరి 1 కి ఎటువంటి అర్థం,శాస్త్రీయత,హేతుబద్ధత,అలాగె ఎటువంటి ఆధారం లేదని మన యువకులకు తెలియాలి. 



'ఖగోళ శాస్త్రం' మన కాలమానానికి ఆధారం.
రోజులు,వారాలు,పక్షాలు,కార్తెలు,మాసాలు,ఋతువులు,ఆయనములు,సంవత్సరములు,పుష్కరాలు,శకాలు,యుగాలు,కల్పాలు....వీటన్నింటినీ ఖగోళం ఆధారంగానే లెక్కిస్తాము.బుద్ధిమంతులు,చదువుకున్న యువకులు,ఏది నిజం,ఏది అబద్దమో తెలుసుకున్నప్పుడే మనం భారతీయులమని అనిపించుకుంటాము.ఇప్పటికినీ ఆంగ్లేయులనే కాపి కొడితే,జిరాక్స్ కాపీలుగా మనం మిగిలిపోతాం తప్ప మనదంటూ స్పెషాలిటీ,అస్తిత్వం లేకుండా పొతుంది.అందుకే డిసంబర్ 31 పోయి,జనవరి 1 రానివ్వండి. దాని కోసం అర్థం లేని సంబరాలు,అనవసర ఖర్చులు,అర్థరాత్రి కేకలు,అరుపులు,త్రాగి ఎగరటాలు,డి జె సౌండ్ తో మన పక్కవాళ్ళను ఇబ్బంది పెట్టటం అవసరమా? మీకు మీరు మీ బుద్ధితో ఆలోచించమని కోరుతున్నాను

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

In the Service of Mother INDIA

Popular Post

Total Visitors

- Copyright © స్వదేశీ జాగరణ మంచ్ Powered by Blogger - Designed by Sainadh Reddyn -