- Back to Home »
- Articles »
- రూపాయి పతనం-10
Posted by : Sainadh Reddy
Sunday, 8 September 2013
ఏ దేశానికైనా దాని కరెన్సీ,ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది.ప్రపంచ దేశాల మధ్య జరిగే వస్తు ఎగుమతి దిగుమతుల కు ఈ రోజు డాలర్ ప్రధాన వాహికగా గుర్తింపు పొందింది.మన దేశంతో పాటు మిగతా దేశాల కరెన్సీలపై కూడా దీని ప్రభావం వుంది.
స్విట్జర్లాండ్ "స్విస్ ఫ్రాంక్ " డాలర్ తో పోలిస్తే 2శాతం విలువ ఎక్కువగ వుండి, ప్రపంచంలోనె ఎక్కువ తలసరి ఆదాయం గల దేశంగా పెట్టుబడిదారులను ఆకర్శిస్తున్న దేశం ఇది.
గ్రేట్ బ్రిటన్ యొక్క 'పౌండ్ స్టెర్లింగ్'డాలర్ తో పోలిస్తే 1.7శాతం విలువ ఎక్కువ.ప్రపంచంలోనే అత్యంత గ్లోబలైజ్డ్ ఆర్థిక వ్యవస్థ గల దేశమిది.
జపాన్ యొక్క 'యెన్" డాలర్ తో 0.6శాతం విలువ ఎక్కువ.ఆటొమొబైల్ మరియు ఎలెక్ట్ర్రానిక్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే మూడవ దేశంగా పేరు పొందింది.
ఇది ఇలా వుంటే మన దేశం యొక్క రూపాయి విలువ 15శాతం తగ్గిందంటే అన్ని దేశాలకంటే మనది దిగజారిన ఆర్థిక వ్యవస్థకు అద్దం పడుతుంది.మన తరువాతి దేశమైన బ్రెజిల్ దేశం యొక్క "బ్రెజిలియన్ రియల్ ' 15.4 శాతం విలువ తగ్గిందన్న అంశం మనకు సంతోషం కలిగిస్తుందేమో.