- Back to Home »
- Articles »
- భారత ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకుంటున్న పాలకులు
Posted by : Sainadh Reddy
Saturday, 7 September 2013
గొప్ప ఆర్థిక వేత్త అయిన మన ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని అయి 9సంవత్సరాల తరువాత మనము ఇప్పటి వరకు దిగుమతుల ద్వారా విదేశీ వస్తువులు వరదలా దేశాన్ని ముంచెత్తి,మనం చెల్లించవలసిన బిల్లు ఎంతో తెలుసా..అక్షరాలా మూడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. ఇందులో రొజూ మనము వినియోగించుకొనే సామాన్య వస్తువులే.ఇవి మన దేశంలొ ఉత్పత్తి చేసుకోవచ్చును.చైనా నుండి వస్తువుల దిగుమతి కోసం చర్చలు సాగిస్తుంది.ఇంకా 34దేశాలతో వ్యాపార చర్చలు సాగుతున్నాయి.అంటే దిగుమతి వస్తువులకు భారత ద్వారాలు 24గంటలు తెరిచివుంచుతారన్నమాట.మన దేశహితం కాని లేని చర్చలతో ప్రభుత్వం కాలం వెళ్ళబుచ్చుతుంది.యూరోపీయ దేశాలతో ఇటీవల జరిగిన చర్చల్లో,ఆ దేశాలవారు తమ దేశాల్లో ఉత్పత్తి అయిన మద్యం పై భారత్ దిగుమతి సుంకంలో కోత విధించాలని,అలాగే దిగుమతి అవుతున్న పాల ఉత్పత్తుల్లో కూడా 60శాతం నుండి 10శాతం దిగుమతి సుంకం తగ్గించాలని ఒత్తిడి తెస్తున్నది.మన ప్రభుత్వం దానికి ఒప్పుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.దిగుమతి అవుతున్న వంట నూనెల పై 300శాతం నుండి 0జీరో శాతం తగ్గించిన కారణంగా,ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకుంటున్న నూనె బిల్లు 60,000కోట్లు చెల్లిస్తున్నాము.మనము అనుసరిస్తున్న విదేశీ విధానాల వల్ల ఇప్పటికే 1కోటి 40లక్షల రైతులు వ్యవసాయం వదలి వలస వెళ్ళారు. మరో వైపు సుమారు 53లక్షల ఉద్యోగులు,ఉపాధి పోయి వీధి పాలయ్యారు. ఇవన్నీ గమనించి,మనకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందా అని అనుమానం వస్తుంది.