- Back to Home »
- Articles »
- దుబారాతో ముప్పు తప్పదు
Posted by : Sainadh Reddy
Saturday, 7 September 2013
అమెరికా లోని దుబారాగా ఖర్చు పెట్టే సంస్కృతి,మన దేశంలో కూడా విస్తరించింది.స్కూల్ కి వెళ్ళే బాలుడు,కళాశాల విద్యార్తులు మొదలుకుని,అధికారులు,రాజకీయ నాయకులు,మంత్రులు అలాగే సామాన్య కుటుంబాలు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టటం ఒక వ్యసనంగా మారింది. ఈ అలవాట్ల వల్లనే అమెరికా ప్రతీసారి ఆర్థిక సంక్షొభం లో ఇరుక్కుంటున్నది.మన దేశంలో కూడా ఆదాయానికి మించిన ఖర్చు చేస్తున్నారు.అత్యవసరం కాకున్నా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టడం ఒక ఫ్యాషన్ గా మారింది.విలాస వస్తువులకు లొంగి పోతున్నారు.గమ్మత్తేమిటంటే స్టాక్ మార్కెట్లు కుప్పకూలి పోవటం, ఉత్పత్తి రంగంలో కాకుండా ,సర్వీస్ (సేవల) రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.దీంతో ఆర్తిక వ్యవస్థ పరొక్షంగా అమెరికా వైపు అడుగులు వేస్తున్నదని గ్రహించలేక పొతున్నారు.బ్యాంకులు,కంపనీలు కుప్పకూలి అమెరికా ప్రజలు నెత్తీ నోరు మొత్తుకున్నారనే సంగతి కూడా మన ప్రజలు అర్థం చేసుకోవాలి.లేదంటే అమెరిక వంటి సంక్షోభం మనకూ అంటుకోనున్నదని ఇటీవలి సంఘటనలు తెలియచేస్తున్నాయి.