- Back to Home »
- Articles »
- ఆర్థిక వేత్త పాలనలో దేశం ???
Posted by : Sainadh Reddy
Saturday, 7 September 2013
ప్రధాన మంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 2011 లో ఐక్య రాజ్య సమితి లో మాట్లాడుతూ గ్లోబలైజైషన్ ను అనుసరిస్తున్న దేశాల్లో నేడు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.ఈ పరిస్థితి ముందు ముందు మరింత విషమించేటట్లు వున్నదని కూడా అన్నారు.అలాంటప్పుడు అది తెలిసి కూడా స్వయంకృతాపరాధంతో స్వయం వినాశం వైపు మన ఆర్థిక వ్యవస్థను ఎందుకు తీసుకొని పోతున్నారో ప్రధానమంత్రే సమాధానం చెప్పాలి.2005నుండి 2009మధ్యలో మన వృద్ధి రేటు 8శాతం వుండేది.అయినప్పటికీ అప్పుడు ఉద్యోగాల్లో పెరుగుదల లేదు.ఇప్పుడు వృద్ధి రేటు 4.5శాతం నడుస్తుంది.పరిస్థితి మీరు ఊహించుకోవచ్చు.పెద్ద పెద్ద కంపనీలకు ఇస్తున్న పన్ను మినహాయింపుల మొత్తం ఎంతో తెలుసా...32లక్షల కొట్ల రూపాయలు.అలా ఇవ్వకుండా వుంటే,ఆ మొత్తంతో మన కరెంట్ అకౌంట్ లోటును పూర్తి చేసుకొవచ్చును.అంతే కాదు 10 ముఖ్యమైన పెద్ద కంపనీలు విదేశాలనుండి తెచ్చిన అప్పు 6,30,000కొట్లకు చేరింది.ఇవన్నీ మన్మోహన్ సింగ్జీ కి తెలియవనుకోవాలా?అమెరికాలోని సగం జనాభా వద్ద నున్న ఎంత సంపద వుందో,అంతే మొత్తం అమెరికాలోని 300మంది సంపన్నుల వద్ద వుంది.మన దేశాన్ని అమెరికాకు నఖలుగా,అమెరికాకు ఉపగ్రహంగా మార్చాలనుకుంటున్నారా?ఏ దేశం ఒత్తిడితో మన ప్రధానమంత్రి ఈ విధంగా వ్యవహరిస్తున్నారో భారతీయులకు జవాబు చెప్పాలి.