- Back to Home »
- Articles »
- ఉపాధ్యాయ దినోత్సవం రొజున చాణక్యుని అమృత సూక్తులు
Posted by : Sainadh Reddy
Sunday, 8 September 2013
ఉపాధ్యాయుడికి సమాజంలో నిజమైన గౌరవం ఎప్పుడు లభిస్తుంది.గౌరవమెప్పుడంటే,భారత దేశం గౌరవశాలిగా వున్నప్పుడు మాత్రమే.దేశం గౌరవశాలిగా ఎప్పుడవుతుందంటే ఈ దేశం తన ప్రాచీన జీవన మూల్యాలను నిర్వహించడంలొ సామర్థ్యం మరియు సఫలత పొందినప్పుడు. ఆ దేశం సామర్థ్యం,సఫలత ఎప్పుడు పొందుతుందంటే,ఉపాధ్యాయులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించటంలో సఫలత సాధించినప్పుడు మాత్రమే.ఆ సఫలతను ఉపాధ్యాయుడు ఎప్పుడు పొందగలడంటే,ఆ ఉపాధ్యాయుడు ప్రతివ్యక్తి హృదయములొ దేశభక్తిని నింపినప్పుడు మాత్రమే.ఒక వేళ వ్యక్తిలో దేశభక్తి లేకపొయినా, దేశం పట్ల హీన భావన వున్నా, దేశం గురించి జాగృత భావన లేకున్నా, అది ఉపాధ్యాయుడి అసఫలతకు ఉదాహరణగా పేర్కొనవచ్చును.జాతీయ శీలం లేని కారణంగా దేశం నేడు ఎన్నో అవమానాలకు గురవుతున్న అనుభవాలు ఎన్నో చూస్తున్నాము.మన శత్రుదెశాలు మనపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నప్పుడల్లా,ఆయుధాలకంటే ముందు మనం మన విలువగల మంచి పుస్తకాల అద్యయనం కొరవడి,అజ్ఞానులమయ్యాము.ఆయుధాలు ధరించి ,శాస్త్రజ్ఞానం కలిగించతం లెదు కాబట్టి,దేశం విభజనకు గురయ్యింది.ఉపాధ్యాయులు దేశం యొక్క సామర్థ్యాన్ని జాగృతం చేయడంలో విఫలం చెందారు.మన పాఠ్య పుస్తకాలతో పాటు,వేద వందనంతో పాటు మన దేశ వందనం కూడా అన్ని వైపులా ప్రతిధ్వనించాలి. వ్యక్తికి దేశాన్ని ఆరాధించటం పట్ల ప్రేమ,శ్రద్ధ లేనట్లయితే,,మిగతా మార్గాలన్నింటిలోనూ సంఘర్షణ తప్పదు.అందుకే వ్యక్తి-వ్యక్తితో,వ్యక్తి-సమాజంతో,సమాజం- దేశంతో కలిసి ఏకత్వంతో సాగాలి.వ్యక్తి త్వరగా సమాజాన్ని దేశంతో ఏకతా సూత్రంతో బంధించాలి.అది దేశభక్తి తో మాత్రమే సాధ్యమవుతుంది.అందుకే వెంటనే ఉపాధ్యాలు ఈ సవాళ్ళను స్వీకరించి దేశ నిర్మాణానికి సిద్ధంగా వుండాలి.ఈ విషయంలో తప్పకుండా ఆటంకాలు ఎదురవుతాయి.అయినప్పటికినీ దీనిలో ఉపాధ్యాయులు విజయం సాధించవలసిందే.