- Back to Home »
- Articles »
- రూపాయి పతనం-2
Posted by : Sainadh Reddy
Thursday, 29 August 2013
రూపాయి విలువ తగ్గితే ఎక్కువ ప్రయోజనం పొందేది ప్రవాసభారతీయులే.విదేశాల్లో వున్న వీరు సంపాదించేది డాలర్ కాబట్టి దాని విలువ పెరిగి సహజంగానే భారత్ కి పంపిస్తే,అంతకు ముందు 1డాలర్ కి 50 రూపాయిలు లభిస్తే ,ఇప్పుడు 65 రూపాయిలు పొందగలరు. కాని భారతీయ ఆర్థిక వ్యవస్థ మాత్రం చిక్కుల్లో పడుతుంది.మనం దిగుమతి చెసుకునే ఆయిల్ 70 శాతం,అందునా డాలర్లలో చెల్లించాలి కాబట్టి ఇబ్బందే కదా.అంతే కాదు ఆయిల్ దిగుమతులు రాను రాను పెరుగుతున్నాయే కాని తగ్గటం లేదు.దాంతో పాటు కొద్ది రోజుల్లో ఆయిల్ ధరలు మరీ పెరగనున్నాయి.
గమ్మత్తేమిటంటే మన రూపాయి ఒక డాలర్ తో మాత్రమే తగ్గలేదు.యూరొ తో, బ్రిటిష్ పౌండ్ తో ,కువైట్ దినార్ తో కూడా పోల్చినప్పటికీ రూపాయి విలువ తగ్గిందంటే మన ప్రభుత్వాల పని తీరు ఎలా వుందో అర్థమవుతుంది. అందుకే కొద్దిరోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల,కార్లు,మొబైల్స్,కంప్యూటర్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటనున్నాయి.