- Back to Home »
- Articles »
- రూపాయి పతనం
Posted by : Sainadh Reddy
Thursday, 29 August 2013
రూపాయి పతనం ఐ టి రంగానికి లాభమే.సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ తమ ఎక్కువ అమ్మకాలు విదేశాల్లో సాగిస్తుంది కాబట్టి అవి కొంత లాభం పొందుతాయి.అవి ఆఫ్ సోర్స్ సర్వీస్ ఎంత ఎక్కువగా చేస్తే అంత లాభం.అయితే విదేశీ అప్పులపై ,విదేశీ ముడిసరుకులపై ఆధారపడే మన పరిశ్రమలు నడుపుతున్న పవర్ జెనరేట్ కంపనీలు,ఆయిల్,ఉక్కు,సిమెంట్ కంపనీలు,టెలీ కమ్యూనికేషన్స్ కంపనీలు రూపాయి పతనంతో నష్టపోనున్నాయి.విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే ఫార్మా ఇండస్ట్రీలు లాభం పొందనున్నాయి.అయితే సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలు మాత్రం మందులు,వంట సామాన్లు,సబ్బులు మరియు కూరగాయలు కొనాలన్నా,పై చదువులు చదవాలన్నా చాలా కష్టం.ఎరువుల ధరలు ,పురుగుల ధరలు పెరిగి రైతులు కష్టాల్లొ పడనున్నారు.హిందుస్తాన్ లివర్ వంటి విదేశీ కంపనీలు ఇప్పటికే ధరలకు పదును పెడుతున్నాయి.