కేవలం క్యాలండెర్ లొ మార్పు వస్తే శుభం ఎలా కలుగుతుంది

జనవరి ఫస్ట్ న శుభం జరగాలని ' విష్ యూ హ్యాపి న్యూ ఇయర్ ' అని చెపుతాం కదా? కేవలం క్యాలండెర్ లొ మార్పు వస్తే శుభం ఎలా కలుగుతుంది?ఖగోళం ప్రకారం వాతావరణం లో జరిగే మార్పుల వల్ల మన శరీరం లో మార్పులు వస్తాయని సైన్స్ చెప్పుతున్నదని నీకు తెలుసుకదా? అందుకే వైరస్ ప్రబలేందుకు అవకాశమున్న ఆ తరుణం లో వేప పచ్చడి తో ఆ వైరస్ ని నిరోధించవచ్చునని మన పూర్వీకులు ఎన్నడో చెప్పారు,అది నిజమని నేటి శాస్త్ర జ్ఞులు కూడ ఒప్పుకుంటున్నారు కదా? అందుకే వసంత ఋతువు లో వచ్చే ఉగాది అందరికి శుభం కలుగ చేస్తుందనటం లో సందేహం అసలే లేదు.కొత్త వేప,కొత్త బెల్లం,కొత్త చెరకు ఇలా కొత్త అందాలను నింపుకునే ప్రకృతి వాతావరణంలో ఉగాది కొత్త సంవత్సరం జరుపుకోవటం ఎంత శాస్త్రీయమో,సమంజసమో కొంత కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే..ఆంగ్ల బానిసత్వానికి వీడ్కోలు పలికి,భారతీయ పద్దతులను మళ్ళీ ఆధునికతకు అనుగుణంగా అందరికీ అందచేసినప్పుడే మన జన్మకు సార్ధకత ఏర్పడుతుంది...ఏమంటారు?

డిశంబర్ 31 ని మాములుగానే పోనియ్యండి..క్యాలండెర్ ని జనవరి 1 కి మాములుగానే మార్చండి. ఆ ఒక్క రాత్రి ఎప్పుడూ పడుకున్నట్లే,నిద్ర పోయి, ఆ ఒక్క రోజును మరిచిపోతే మీ జన్మ ధన్యమైనట్లే! మన ఉగాది కొత్త సంవత్సరం ఏమి నేర్పుతుంది.?..సూర్యోదయం తో పండుగ మొదలవుతుంది.కనుక డిసంబర్ 31అర్థరాత్రి పిచ్చి పనులకు అవకాశం లేదు.ఉదయం తల స్నానం చేసి ,దేవున్ని మొక్కి,కొత్త బట్టలు తొడిగి,బంధువులు,తల్లిదండ్రులు,స్నేహితులతో కలిసి వేప పువ్వు పచ్చడిని తీసుకుంటాం.పొరుగువాళ్ళకు పంచుతాము.ముగ్గులు,మామిడి తోరణాలతో అలంకరించుతాము.ఆరోగ్యకరమైన పచ్చడి, సాంప్రదాయ భోజనాలు స్వీకరిస్తాము. సాయంత్రం దేవాలయం వెళ్ళి,లేదా రచ్చబండ వద్ద పంచాంగ శ్రవణం తో గడుపుతాము. ఖగోళం ప్రకారం కాలమనం లెక్కించే పద్దతి తెలుస్తుంది.జీవితం లో నియమ బద్ధత ఏర్పడుతుంది.ఆద్యాత్మిక ప్రశాంతి ఏర్పడుతుంది.కుటుంబమంతా సంతోషంగా వుంటుంది.తప్ప త్రాగటం, తూలటం,పిచ్చిగా వాగటం ఏమీ వుండవు.మన ఉగాది పండుగ మనకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పుతుందంటే ....ఉగాదిని మనం ఎందుకు ఘనంగా జరుపుకోకూడదు? ఈ విషయాన్ని అందరికీ ఎందుకు అర్థం చేయకూడదు? రక రకాలైన కాలేయ సంబంధమైన రోగాలకు కారణమైన మద్యం త్రాగటం కంటె...వేపపువ్వు,కొత్తబెల్లం,శనగపప్పు,అరటిపళ్ళు,మామిడిముక్కలు,కొబ్బరిముక్కలు,చెరకు గడలు మొదలైన వాటితొ ఉగాది పచ్చడి చేసుకుని త్రాగితే నిజంగా ఆరొగ్యం కాదా? డిశంబర్ 31 ని మాములుగానే పోనియ్యండి..క్యాలండెర్ ని జనవరి 1 కి మాములుగానే మార్చండి. ఆ ఒక్క రాత్రి ఎప్పుడూ పడుకున్నట్లే,నిద్ర పోయి, ఆ ఒక్క రోజును మరిచిపోతే మీ జన్మ ధన్యమైనట్లే!



హ్యాపీ న్యూ ఇయర్,డిశంబర్ 31 రాత్రి 12 గంటలు,ఆంగ్లేయుల ఈ కొత్త సంవత్సరం చివరికి మనకు నేర్పుతున్నదేమిటి? డిశంబర్ 31 అర్థరాత్రి క్లబ్బుల్లోనూ,హోటల్స్ లోనూ,ఇళ్ళలోనూ,తోటల్లోనూ,రోడ్లమీదా...ఆడ,మగ తేడాలేకుండా గుంపులు..గుంపులుగా జనం చేరుతున్నారు.ఇందులో యువతీ యువకులు ఎక్కువగా వుంటున్నారు.వెస్టర్న్(పాశ్చాత్య)మ్యూసిక్ ల హోరులో,జోరులో,కేరింతలతో,చిందులేస్తూ అల్లరిచేస్తూ, కాలం గడుపుతారు.కొందరు పేకాట వంటి జూదాలు ఆడితే,మరి కొందరు మత్తుపదార్థాలు సేవిస్తారు.ఇలా వివిధ రకాలైన దురభ్యాసాలతో,అసభ్యరీతుల్లో ప్రవర్తిస్తుంటారు.రోడ్లపై పరుగులు,అరుపులూ,గోల,కేకలు... రాత్రి సమయమంతా టెలివిజన్ చానల్స్ విదేశీ సంగీత నృత్యాలతో రెచ్చిపోతున్నారు.షాంపైన్ బాటిల్స్ ఒపెన్ చేస్తూ ఆ నురగల్లో ఉబ్బితబ్బిబ్బైపోతారు.అర్థరాత్రి పిశచాల ఆనందం అంటే ఇదేనేమో? ఈ దురాచారం నగరాల నుండి గ్రామాలకు ప్రాకిపోయింది. అందరూ చేస్తున్నారు..మేము చేయకపోతే ఎలా అంటూ గొర్రెల మందలా అనుసరిస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్,డిశంబర్ 31 రాత్రి 12 గంటలు,ఆంగ్లేయుల ఈ కొత్త సంవత్సరం చివరికి మనకు నేర్పుతున్నదేమిటి? తాత్కాలికి ఎంజాయ్ మెంట్ ,దురలవాట్లు,మన స్వంత ఆచారాలను,సంప్రదాయాలను తెలుసుకోలేని అజ్ఞానం,విచ్చలవిడితనం,అనవసర ఖర్చులు.. గత పన్నెండు నెలలుగా చేసిన మంచి ఆలోచనలు,నోములు,వ్రతాలు,దేవాలయ దర్శనాలు ,మొక్కులు,మొక్కుబడులు,హిందూమతం,భారతీయ భావన ....బూడిదలో పోసిన పన్నీరులా, మనదంతా విదేశీయులకు ధారపోసి ఆ ఒక్క అర్ధరాత్రి డిశంబర్ 12 గంటలకు ఆ కొద్ది సేపు ఆంగ్లేయుల అలవాట్లకు సాష్టాంగ పడి,సరెండర్ అయి పోయి, బానిస బ్రతుకులుగా మారిపోవటం ఎంత బాధాకరమో,అవమానకరమో,ఎంత మూఢాచారమో,ఎంత అజ్ఞానమో,స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్ళు గడిచినా,మనం మారేది ఎప్పుడో? అని మీకు మీరు అలోచించుకోవటం కోసమే ఇదంతా చెప్పేది! అంతే కాని బలవంతంగా చెప్పలేము కదా? ఈ స్వేచ్చాయుత దేశం లో ఆలోచించమని చెప్పగలము అలాగే గుడ్డిగా ఏదీ కూడా అనుసరించవద్దని విన్నపం చేయగలం.


సైన్స్ తెలిసిన వాళ్ళం అని మనం చెప్పుకుంటాం కదా? వూరందరిదీ ఒకదారి అయితే,వులిపి కట్టెది మరో దారి" అన్నట్లు మనం ఎందుకు వుండాలి?,నలుగురితో పాటూ నారాయణా' అన్నట్లు వుండాలి కదా?ప్రపంచమంతటా జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ గా జరుపుకుంటే మనం ఆచరిస్తే తప్పేమిటి?అదేమైన నేరమా? కానే కాదు.జనవరి ఫస్ట్ టు డిశంబర్ ఎక్కువమంది జరుపుతున్నారు.కాదనను.కాలమానం,ఖగోళం ప్రకారం 'జనవరి ఫస్ట్' న్యు ఇయర్ కాదని, మనకు న్యూ ఇయర్ 'ఉగాది ' అని మాత్రమే తెలుసుకోవాలి.చదువుకున్నవాళ్ళమని,ఆధునికులమని,సైన్స్ తెలిసిన వాళ్ళం అని మనం చెప్పుకుంటాం కదా? "జనవరి ఫస్ట్ " సైన్స్ ప్రకారం న్యూ ఇయర్ కాదని తెలిసి కూడా ఎలా..ఎందుకు జరుపుకోవాలో చెప్పగలమా?మనం ఖగోళ శాస్త్రం అనుసరించి వేల సంవత్సరాలుగా కాలమానం లెక్క పెడుతుంటే,వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంగ్లేయులు మన దేశం తో పాటూ 71 దేశాలపై ఆక్రమణ చేసి, బలవంతంగా వాళ్ళ క్యాలండర్ ని,కాలమానంగా రుద్దినందు వల్ల మనం పాటిస్తున్నాము.ఇప్పుడు ఆంగ్లేయులు లేరు కదా? ఇప్పటికైన నిజాలు,గుణపఠాలు నేర్చుకుని నడవటం బుద్ధిమంతుల లక్షణం కాదా చెప్పండి?


గడియారం 12 కొట్టగానే మూర్చ వచ్చినట్టు.... 
 మనందరికీ ఎంతో కొంత సైన్స్ తెలుసు.నక్షత్రాలు,గ్రహాలు,ఉపగ్రహాలు,తోకచుక్కలు,గ్రహశకలాలు మొదలైన వాటి గురించి తెలిపే శాస్త్రమే ఖగోళం.మన న్యూ ఇయర్ అంటే "ఉగాది" ఖగోళం ప్రకారం వస్తుంది.జనవరి ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళకు అలా రాదు.వ్యక్తులు నిర్ణయించిన న్యూ ఇయర్ అది.మన పండుగలు అలా కాదు.గడియారం 12 కొట్టగానే మూర్చ వచ్చినట్టు,ఆవేశంగా వూగిపోతూ మన యువకులు వెర్రెక్కిపొతుంటే,వీళ్ళేనా మన వివెకనంద,శివాజీ,రాణాప్రతాప్,భగత్ సింగ్ తమ్ముళ్ళు?క్రికెట్ లో ఇంగ్లాండ్ ని వోడించిన మన భారత క్రికెట్ యోధుల అభిమానులు వీరేనా? 7లక్షల భారతీయ యువకులు 90 సంవత్సరాలు ఆంగ్లేయులతో పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని,ఆ అమరవీరుల ఆత్మల్ని,ఒక్క డిశంబర్ 31 అర్ధరాత్రి రోజునే బ్రిటిష్ వాళ్ళు అందించిన బీరు,బ్రాందీ,విస్కీ బాటిళ్ళతో మన వాళ్ళను మనమే చంపుకుంటున్న యువకులు బహుశా ఏ దేశం లో కూడా ఉండరేమో అనిపిస్తుంది.
Saturday, 28 December 2013
Posted by Sainadh Reddy
Tag :

హ్యాపీ న్యూ ఇయర్

హ్యాపీ న్యూ ఇయర్ ' అని చెప్పకపోతే లోకం ఏమనుకుంటుందోనని భయమేసి కొందరు,జనవరి ఫస్ట్ ఇంగ్లీష్ సంవత్సరమని తెలియక కొందరు,సాగుతున్న ప్రపంచానికి ఎదురుచెప్పలేక కొందరు, ఇంగ్లీష్ వాళ్ళు నేర్పించిన ఈ విధానాన్ని కాపీ కొడుతూ ఎంజాయ్ చేసే విద్యావంతులు ఇంకొందరు మొత్తానికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పక తప్పటం లేదు.చెప్పటం తప్పు అనటం లేదు,కాని ఈ అలవాటు ముదిరిపోయి అంటువ్యాధిగా అందరికి చుట్టుకుంటూన్నది.విదేశీ అనుకరణలు,పిచ్చి అలవాట్లలో కోట్లాది మన యువత అజ్ఞానంతో,శాస్త్రీయమైన మన సంస్కృతిని దూరం చేసుకుంటున్నారనే బాధ అంతటా వ్యాపిస్తున్నది.డిశంబర్ 31 తరువాత వచ్చే జనవరి 1 కి ఎటువంటి అర్థం,శాస్త్రీయత,హేతుబద్ధత,అలాగె ఎటువంటి ఆధారం లేదని మన యువకులకు తెలియాలి. 



'ఖగోళ శాస్త్రం' మన కాలమానానికి ఆధారం.
రోజులు,వారాలు,పక్షాలు,కార్తెలు,మాసాలు,ఋతువులు,ఆయనములు,సంవత్సరములు,పుష్కరాలు,శకాలు,యుగాలు,కల్పాలు....వీటన్నింటినీ ఖగోళం ఆధారంగానే లెక్కిస్తాము.బుద్ధిమంతులు,చదువుకున్న యువకులు,ఏది నిజం,ఏది అబద్దమో తెలుసుకున్నప్పుడే మనం భారతీయులమని అనిపించుకుంటాము.ఇప్పటికినీ ఆంగ్లేయులనే కాపి కొడితే,జిరాక్స్ కాపీలుగా మనం మిగిలిపోతాం తప్ప మనదంటూ స్పెషాలిటీ,అస్తిత్వం లేకుండా పొతుంది.అందుకే డిసంబర్ 31 పోయి,జనవరి 1 రానివ్వండి. దాని కోసం అర్థం లేని సంబరాలు,అనవసర ఖర్చులు,అర్థరాత్రి కేకలు,అరుపులు,త్రాగి ఎగరటాలు,డి జె సౌండ్ తో మన పక్కవాళ్ళను ఇబ్బంది పెట్టటం అవసరమా? మీకు మీరు మీ బుద్ధితో ఆలోచించమని కోరుతున్నాను
Posted by Sainadh Reddy
Tag :

గణపతి పండుగతో అందరికీ విజయమే


గణపతి తో పాటు హిందువుల దేవతలు ఈ భారత భూమిలో స్వాతంత్ర్య సాధనకు చేయూతనిచ్చారు.1905లో పూనా పట్టణంలో విజయదశిమి ఉత్సవంలో 2000విద్యార్థులు,3000పెద్దలు పాల్గొని విదేశీ వస్తు దహనం జరిపి తిలక్ నాయకత్వం లో స్వరాజ్య జ్వాలకు నిప్పుకణికను అందించారు.మన దేశంలో మతం అంటే మత్తుమందు కాదు..నిద్రపోయిన జాతిని మేల్కొల్పిన వేదాంతమిది.ప్రజలకు వినాయకునిలో కూడా జాతిఉద్యమానికి నేతృత్వం వహించిన ప్రజానాయకుడు కనిపించాడంటే, హిందూ మత దేవుళ్ళందరూ స్వాతంత్ర్య పోరాట ప్రేరకులే...ఎన్ని కులాలు,మతాలున్నా అందరిని అన్నదమ్ముల్లా కలిపిన భారత బంధువులే..1630లో జిజియాబాయి తన 12ఏళ్ళ శివాజిని తీసుకుని పూనా పట్టణానికి వచ్చింది. అక్కడ మొఘలుల దౌర్జన్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మావళీలకు స్వేచ్చను ప్రసాదిస్తానని బాలుడు శివాజి హామీ ఇస్తాడు.అక్కడే కనిపించిన గణపతి విగ్రహాన్ని వెలికితీసి,కాస్బా గణపతి మందిరాన్ని జిజియాబాయి నిర్మించింది.ఇక్కడినుండే బాల శివాజీ హిందూ స్వరాజ్య సాధనకు కలలు కని ప్రణాళికలు రచించాడు.గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఆ ప్రేరణతో కదం త్రొక్కాడు.విజయం సాధించాడు.అందుకే మన స్వేచ్చకు అండగా, గణపతి వుండగా మనకెందుకు భయం.
Monday, 9 September 2013
Posted by Sainadh Reddy
Tag :

స్వదేశీకి ప్రేరణ - వినాయకుడి ఆరాధన


ఈస్ట్ ఇండియా కంపనీ మన చిన్న,గ్రామీణ,కుటీర పరిశ్రమలను దెబ్బతీసింది. కోట్ల విలువైన ముడిసరుకును ఈ దేశం నుండి దోచుకునిపోయి,తయారైన వస్తువులను మళ్ళీ మన దేశంలోనె అమ్ముతూ లాభాలు గడించి మన సంపదను లూటీ చేసుకుపోయింది.భారత దేశంలోని వ్యాపార,వాణిజ్య,వ్యవసాయ,గనులు మరియు అటవీ సంపద అంతా తెల్లవాళ్ళ ఆధీనము లోకి రావడానికి చట్టాలు తెచ్చి ఆర్థిక వ్యవస్థను స్వాధీనం చేసుకున్నది.ఈ బ్రిటిష్ వారి కుటిలనీతి అర్థం కాక,సామాన్యులే కాదు విద్యావంతులు కూడ బానిసలై జీవించ సాగారు.అదే సమయం లోనే 1905లో 'విభజించి పాలించు ' అన్న దుర్మార్గ విధానంతో బెంగాల్ ను వంగ విభజన పేరుతో రెండుగా చీల్చే ప్రకటన చేసి దేశంలో చిచ్చుపెట్టారు ఆంగ్లేయులు.ఆ సమయంలొనే చిచ్చుర పిడుగై బాల గంగాధర్ తిలక్, ప్రజల మధ్యలో,ప్రజల భాషలో ఆంగ్లేయుల నయ వంచనను కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ స్వదేశీ ఉద్యమాన్ని అన్ని వైపులా కొనసాగించారు.విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చాడు.తిలక్ కంటే ముందు మహ దేవ గోవింద రానడే డిసంబర్ 1872,ఫిబ్రవరి 1873లలో విదేశీ ఆర్థిక కుట్రలను తన ఉపన్యాసాల ద్వారా చీల్చి చెండాడాడు.అది వారస్వత్వంగా గ్రహించి తిలక్ గణపతి,శివాజి ఉత్సవాల ద్వారా చరిత్రను సృష్టించాడు.అన్ని కులాలను కలిపే మహదవకాశం గణపతి పండుగకు లభించింది.ఇంకేమి కావాలి? అందరూ ఏకమయ్యారు.స్వదేశీ విప్లవ శంఖం పూరించబడింది.ప్రజలు విదేశీ వస్తువులను సేకరించి ఒక దగ్గర్ కుప్పగా పోసి తగులపెట్టారు.ఆంగ్లేయులు నివ్వెరపొయారు.అంతే ...వంగ విభజన ఆగిపోయింది. ప్రజా ఉద్యమానికి నాయకుడు తిలక్ ఐతే ,ప్రజా హృదయాలలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన వాడు వినాయకుడు.అందుకే వినాయకుడా?మజాకా?..
Posted by Sainadh Reddy
Tag :

గణపతి ఆరాధన- శక్తి ఆరాధన


పండితులు,సామాన్యులు,పల్లె ప్రజలు, నగరవాసులు, చిన్నపిల్లలు, యువకులు,వృద్ధులు మొదలైన వారందరూ జట్లు జట్లుగా(గణాలుగా) కలిసివుంటే వారందరికి(ఈ గణాలకు) పతి అంటే నాయకుడు అంటే గణపతిని ముందు నిలిపి,ఆయనను కొలిచి,మన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సాగుతున్న భారత జాతీయ జీవనమిది.అందరిలో ఐక్యతను నిర్మాణం చేయగల బలవంతుడు ఆయన. ప్రజలకు అందుబాటులో వుండే ప్రజానాయకుడూ వినాయకుడు. మన చుట్టూ వున్న పరిస్థితులను చూసి భయపడనవసరం లేకుండా,లోకజ్ఞానం అందించే గొప్పవాడు.పంచ భూతాలతో(భూమి,నీరు,గాలి,అగ్ని, ఆకాశం) నిర్మాణమైన ఈ ప్రకృతిని రక్షించటం మన బాధ్యత.ఏమీ ఇచ్చుకోలేని పేదవాడైనా గడ్డిపరక పెట్టినప్పటికినీ,ఆనందపడే నిరాడంబర దేవుడు ఆయన.ఆ గడ్డిపరకతో అద్భుత జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఆయనను భక్తితో ప్రేమిస్తే చాలు కోరికలు తీర్చగల వినాయకుడు అతడు.పొలాల గట్ల మీద పొతుంటే కనిపించే ఉమ్మెత ఆకు,రేగు ఆకు,తులసి ఆకు,బిల్వ పత్రం,ఉత్తరేణీ,మామిడి,జాజి,రావి,జిల్లెడు,పొద్దుతిరుగుడు,దానిమ్మ,వావిలాకు,జమ్మీ మరియు గన్నెరు ఆకులతో పూజిస్తె పొంగిపోతాడు. ఈ చెట్లన్నిటిని రక్షించాలనే అర్థం ఇందులో లేదా? ఆయనకు పెట్టే వస్తువులోనైనా రసాయన పదార్థాలు లేవు.అన్ని సహజంగా ప్రకృతి ఇచ్చినవే కదా?బియ్యము,కొబ్బరితో చేసిన కుడుములు ఆరోగ్యానికి మంచిది.పసుపు యాంటిసెప్టిక్,కుంకుమ,గంధం చల్లదనానికి సంకేతం.ఆయన ముందు కూర్చుని ప్రార్థించటమంటే,అనంతమైన ఆ శక్తివంతుడిని నుండి జన్మించిన మనం,ఆ శక్తిని మనకు ప్రసాదించాలని,మన ఆశయాలను నెరవేర్చాలని,విఘ్నములుకలుగకుండా ఆశీర్వదించాలని అర్థం
Posted by Sainadh Reddy
Tag :

వినాయక చవితి - జాతీయ పండుగ


1857 ప్రథమ స్వాతంత్ర్య సమరం జరుగుతున్న రోజులు.గణపతి అందరి దేవుడిగా పూజలందుకుంటూ వీధి,వీధిన తిరుగుతుంటే భారతీయ సంస్కృతి,దేశభక్తి భావన ప్రజల్లో పెల్లుబుకుతున్నది.పీష్వాల కులగురువుగా పూజలందుకున్న గణపతి బ్రాహ్మణుడు మొదలుకుని అన్ని కులాల ఆరాధ్య దేవతగా అవతరించాడు.సామాన్య ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటూ వుంటే,జాతీయ నాయకులు తమ ఉపన్యాసాలతో బ్రిటిష్ వారి ఉక్కు పిడికిళ్ళ నుండి భరతమాతకు స్వేచ్చ ను ప్రసాదించడానికి అందరికి ప్రేరణ ఇస్తున్నారు. 1893 లో ఒక వైపు స్వామివివేకానంద చికాగో సభ ద్వారా భారతీయుల గత వైభవ శంఖాన్ని పూరిస్తే,మరోవైపు ఆ స్వామీజి ప్రేరణతో బాల గంగాధర తిలక్ మొట్ట మొదటి గణపతిని వీధుల్లో ప్రతిస్ఠాపించి స్వరాజ్య ఢంకా మ్రోగించాడు.మొదట మహరాష్ట్రా వరకే పరిమితమై,నెమ్మదిగా గోవా,కొంకణ్, తమిళ నాడు,కర్నాటక,ఆంధ్రప్రదేశ్ లలో ఘనంగా జరుపుకుంటూ నేడు ప్రపంచ దేశాలన్నింటిలో అన్ని వర్గాల్లో ఆధ్యాత్మికత, జాతీయ మరియు వేదాంత భావనలు నింపుతున్న పండుగ ఇది.
Posted by Sainadh Reddy
Tag :

In the Service of Mother INDIA

Popular Post

Total Visitors

- Copyright © స్వదేశీ జాగరణ మంచ్ Powered by Blogger - Designed by Sainadh Reddyn -